డిల్లీ మద్యం కుంభకోణం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. 160 సీఆర్పీసీ కింద విచారణ ముగిసిందో లేదో..ఇప్పుడు 91 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ అయ్యాయి. ఆ వివరాలు మీ కోసం..
ఢిల్లీ మధ్యం కేసులో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కాస్సేపటి క్రితమే సీబీఐ విచారణ ముగించింది. ఆమె స్వగృహంలో దాదాపు 7 గంటలు విచారించిన సీబీఐ ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోయింది. అవసరమైతే మరోసారి విచారిస్తామని చెప్పిన సీబీఐ కొద్దిగంటల్లోనే షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీ కవితకు ఈసారి 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చింది.
ఇవాళ అంటే డిసెంబర్ 11న ఆమె స్వగృహంలో 160 సీఆర్పీసీ కింద నోటీసులతో విచారించిన సీబీఐ కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఈ విచారణ ముగిసిందో లేదో..కవిత ఊపిరి పీల్చుకునేలోగానే మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఈసారి 91 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చింది.
సీబీఐ డీఐజీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో కవితను ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టారు. ప్రధానంగా అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్, సౌత్ గ్రూప్ ముడుపుల వ్యవహారం, ఢిల్లీ మంత్రి సిసోడియా, శరత్ చంద్రారెడ్డితో పరిచయాలు, సెల్ఫోన్ల ధ్వంసంపై ఆరా తీసినట్టు సమాచారం.
సీఆర్పీసీ 91 అంటే ఏమిటి
కోర్టు లేదా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లేదా దర్యాప్తు అధికారి ఎప్పుడైనా సరే ఏదైనా డాక్యుమెంట్ లేదా వస్తువును దర్యాప్తుకు లేదా విచారణకు అవసరమని భావిస్తే..ఆ వస్తువు లేదా డాక్యుమెంట్ ఎవరి వద్ద ఉందో వారికి సీఆర్పీసీ 91 ప్రకారం నోటీసులు జారీ చేస్తారు. అంటే ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత నుంచి ఏదో కీలకమైన ఆధారాన్ని తీసుకునేందుకు సీబీఐ భావిస్తున్నట్టుగా కన్పిస్తోంది.
Also read: Delhi Liquor Scam: 7 గంటలసేపు విచారించిన సీబీఐ, కవిత స్టేట్మెంట్ రికార్డ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook