PM Kisan: రైతుల ఆదాయం రెట్టింపు.. లెక్కలు బయటపెట్టిన కేంద్ర మంత్రి

PM Kisan Samman Nidhi: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హయాంలో అనేక రాష్ట్రాల్లో రైతుల ఆదాయనం రెట్టింపు అయిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన గణంకాలను ఆయన బయటపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కంటే తమ ప్రభుత్వంలో అన్నదాతలకు ఎంతో మేలు జరిగిందన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2022, 12:39 PM IST
  • అనేక రాష్ట్రాల్లో రైతుల ఆదాయనం రెట్టింపు
  • గణంకాలను వెల్లడించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్
  • నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ
PM Kisan: రైతుల ఆదాయం రెట్టింపు.. లెక్కలు బయటపెట్టిన కేంద్ర మంత్రి

PM Kisan Samman Nidhi: రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి.. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుంటోందని కేంద్ర సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. 2014-22 మధ్య కాలంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి బడ్జెట్‌లో దాదాపు 6.22 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. రైతుల ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.

2.16 లక్షల కోట్లు నేరుగా ఖాతాలోకి..

మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 2006-14 సంవత్సరం వరకు వ్యవసాయ బడ్జెట్ రూ.1,48,162.16 కోట్లుగా ఉంది. అదే సమయంలో 2014-22 సంవత్సరానికి వ్యవసాయ రంగానికి రూ.6,21,940.92 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్రం 2.16 లక్షల కోట్ల రూపాయలను అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పంపింది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం మూడు వాయిదాలలో సంవత్సరానికి రూ.6 వేలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తోంది. 

ప్రహ్లాద్ సింగ్ పటేల్ మాట్లాడుతూ.. చాలా రాష్ట్రాల్లో రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందన్నారు. అనేక సంస్థలు కూడా ఇదే విషయాన్ని నివేదికల్లో వెల్లడించాయని చెప్పారు. రైతులకు ఆధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ప్రధానమంత్రి సాధికారత కల్పించారన్నారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా అవినీతి, మధ్య దళారుల సమస్య నుంచి విముక్తి పొందడమే కాకుండా రైతులను అనేక రకాల సమస్యల నుంచి కాపాడారని పేర్కొన్నారు.

ఈ-నామ్ పోర్టల్‌తో అనుసంధానం

డిజిటల్ టెక్నాలజీ ద్వారా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం నేరుగా వారికి చేరుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. 'విత్తనం నుంచి మార్కెట్ వరకు', 'డిజిటల్ అగ్రికల్చర్ మిషన్' రైతుల జీవనశైలి పరిస్థితులలో మార్పులు తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయన్నారు. దేశవ్యాప్తంగా 1.74 కోట్ల మంది రైతులను ఈ-నామ్ పోర్టల్‌తో అనుసంధానించామని.. ఈ-నామ్ ద్వారా 2.36 లక్షల వ్యాపారాలు నమోదు చేసుకున్నారని వెల్లడించారు.

రూ.1.25 లక్షల కోట్ల

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రూ.1.25 లక్షల కోట్ల విలువైన క్లెయిమ్‌లు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. అదే సమయంలో రైతులకు బీమా ప్రీమియంగా రూ.25,185 కోట్లు ఇచ్చామన్నారు. ఇప్పటివరకు 3,855కి పైగా ఎఫ్‌పీఓలు నమోదయ్యాయని, 22.71 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేశామని, 11,531 టెస్టింగ్ లేబొరేటరీలకు అనుమతి ఇచ్చామని చెప్పారు. గత ప్రభుత్వంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజనకు రూ.6,057 కోట్లు కేటాయిస్తే.. మోదీ ప్రభుత్వం దాదాపు 136 శాతం పెంచి రూ.15,511 కోట్లు కేటాయించిందన్నారు.

'మైక్రో ఇరిగేషన్ ఫండ్ కింద 17.09 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రూ.4,710.96 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రుణం రూ.7.3 లక్షల కోట్లుగా ఉంది. 2022-23 సంవత్సరానికి మోదీ ప్రభుత్వం లక్ష్యాన్ని రూ.18.5 లక్షల కోట్లకు పెంచింది. రైతులకు సరసమైన ధరలకు భూసారం అందేలా ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని కూడా పెంచింది. ప్రపంచంలో వ్యవసాయోత్పత్తుల విషయంలో భారత్ మొదటి లేదా రెండో స్థానంలో ఉంది. రూ.3.75 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి రికార్డు సృష్టించింది. వ్యవసాయ రంగంలో గతంలో 100 స్టార్టప్‌లు మాత్రమే పనిచేసేవి. అయితే గత 7-8 ఏళ్లలో ఈ సంఖ్య 4 వేలకు పెరిగింది..' అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వెల్లడించారు.

Also Read: Visakhapatnam Woman: గంజాయి మత్తులో యువతి అర్ధరాత్రి హల్‌చల్.. బీర్ బాటిల్‌తో ఏఎస్ఐపై దాడి  

Also Read: Kane Williamson: కేన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం.. టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News