Avatar 2 Movie: విడుదలకు ముందే అవతార్ 2 సినిమా లీక్, కధ ఎలా ఉంటుంది, ఇంకెన్ని సీక్వెల్స్ ఉన్నాయి

Avatar 2 Movie: అవతార్ 2 సినిమా. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అద్భుతం. మరి కొద్దిగంటల్లో విడుదలౌతుందనగా..పెద్ద షాక్ ఎదురైంది. నెట్టింట సినిమా విడుదలైంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 15, 2022, 10:38 PM IST
Avatar 2 Movie: విడుదలకు ముందే అవతార్ 2 సినిమా లీక్, కధ ఎలా ఉంటుంది, ఇంకెన్ని సీక్వెల్స్ ఉన్నాయి

అవతార్ మొదటి భాగం సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ స్ఫూర్తితోనే అవతార్ 2 తెరకెక్కి..డిసెంబర్ 16 అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా నెట్టింట లీక్ కావడం ఆందోళన కల్గిస్తోంది. 

ప్రముఖ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 2 సినిమా రేపు విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రీ బుకింగ్స్ హాట్ కేక్స్‌లా అమ్ముడయ్యాయి. కొన్ని గంటల్లో థియేటర్లలో విడుదలౌతుందనగా..నెట్టింట సినిమా లీక్ కావడం ఆందోళన కల్గిస్తోంది. టెలీగ్రామ్‌లో అవతార్ 2 థియేటర్ ప్రింట్ ఉందనే వార్త వైరల్ అవుతోంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన సినిమా పైరసీ బారిన పడటం కలకల కల్గిస్తోంది. నెట్టింట లీక్ అయిన సినిమా ప్రింట్ ఎక్కడి నుంచి ఎలా జరిగిందనే విషయం ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను డిలీట్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. 

జేమ్స్ కామెరూన్ టెక్నాలజీ సహాయంతో పండోరా అనే ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అందులో నావీ అనే అటవీ తెగ జీవిస్తుంటుంది. ప్రకృతే ప్రాణంగా జీవించే వింత ప్రాణులకు, అభివృద్దే లక్ష్యంగా దూసుకెళ్లే మనుషులకు మధ్య జరిగే పోరాటమే ఇది. రెండవభాగంలో జేమ్స్ కామెరూన్ మరో ప్రపంచాన్ని చూపించనున్నారు. సముద్రానికి చెందిన ఎన్నో విశేషాల్ని చూపించబోతున్నారు. మరోవైపు అవతార్ సంబంధించి అవతార్ 3, అవతార్ 4, అవతార్ 5 కూడా ఉంటుందని తేలింది. ఇందులో అవతార్ 3 కూడా జేమ్స్ కామెరూన్ తెరకెక్కించనున్నారు. 

Also read: Tollywood Heroine: ఇదేందయ్యా ఇదీ.. లేడీ టెక్నీషియన్ తో ప్రేమలో పడిన టాలీవుడ్ హీరోయిన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News