Diabetes Symptoms: మీరు మధుమేహం బారిన పడితే.. ఇలాంటి లక్షణాలు తప్పకుండా వస్తాయి!

Diabetes Symptoms: శరీరంలో తగినంత ఇన్సులిన్ పరిమాణాలు తగిన మోతాదులో లేకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు మధుమేహం వ్యాధి కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు ఉత్పన్నమైతే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2022, 04:32 PM IST
Diabetes Symptoms: మీరు మధుమేహం బారిన పడితే.. ఇలాంటి లక్షణాలు తప్పకుండా వస్తాయి!

Diabetes Symptoms: శరీరంలో తగినంత ఇన్సులిన్ పరిమాణాలు లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణాలు హెచ్చు తగ్గులు మార్పులు వస్తాయి. దీంతో తీవ్ర మధుమేహం సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా  టైప్ 2 మధుమేహం వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం 422 మిలియన్ల మంది మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగితే తప్పకుండా దాని ప్రభావం గుండె, మూత్ర పిండాలపై కూడా పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగితే శరీరంపై పలు లక్షణాలు ఉత్పన్నమవుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగితే ఎలాంటి లక్షణాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1) తరచుగా మూత్రవిసర్జన:
చాలా మందిలోని రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగడం వల్ల తరచుగా మూత్రవిసర్జనకు గురవుతారని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అలస వంటి సమస్య కూడా వచ్చే అవకాశాలున్నాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి మూత్రపిండాలు మార్పులు సంభవించి శరీరంలో చక్కెరను ఫిల్టర్‌ చేయడాన్ని తగ్గిస్తాయి. ఇలాంటి లక్షణాలు కూడా మధుమేహానికి దారి తీయోచ్చు.

2)ఉన్నటుండి బరువు తగ్గడం:
శరీరంలో జీర్ణ క్రియ సక్రమంగా ఉంటేనే  గ్లూకోజ్‌ స్థాయిలు సక్రమంగా ఉంటాయి. అయితే జీర్ణ క్రియ దెబ్బతింటే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు వేగంగా బరువు తగ్గే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా పలు మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే శరీరంలో మధుమేహం వ్యాధి, గుండె పోటు వంటి సమస్యలు వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది.

3) నిరంతరం, అలసట:
రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన  చేయడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. దీని వల్ల డీహైడ్రేషన్, నిరంతరం, అలసట వంటి సమస్యలు వస్తాయి. దీని వల్ల శరీరంలో గ్లూకోజ్‌లో మార్పులు సంభవించి మధుమేహం ఉన్నవారిలో తీవ్ర తరమయ్యే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా మధుమేహం వ్యాధి ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇలాంటి క్రమంలో వైద్య పరీక్షలు చేసుకోవడం చాలా మంచిది.

4) పుండ్లు, గాయాలు:
రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా స్థిరంగా ఉంటే రక్త నాళాలు దెబ్బతింటాయి. ఇది రక్త ప్రసరణపై పడి తీవ్ర మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా దీని ప్రభావం శరీరంపై కూడా పడి  పుండ్లు, గాయాలు నయం కాకపోవచ్చు. అంతేకాకుండా పుండ్ల సమస్యలు పెరిగే అవకాశాలున్నాయి. ఇలా ఉన్నప్పుడు తప్పకుండా వైద్యలును సంప్రదించాల్సి ఉంటుంది.

Also Read : Pushpa The Rise Glimpse : వెనుకడుగు వేసిన పుష్ప టీం.. అవతార్‌ 2తో పాటు థియేటర్లో రాకపోవడానికి కారణం ఇదేనట

Also Read : chiranjeevi-Radhika : చిరు రాధిక కాంబోలో సినిమా.. నాడు ఇచ్చిన మాటకోసమేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News