Bullet Bike Caught Fire: తగలబడిన బుల్లెట్ బైక్.. వీడియో వైరల్

Bullet Bike Catches Fire: ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుని మెయింటెన్ చేయడాన్ని ఒక స్టేటస్ సింబల్‌గా భావించే వాళ్లకు కొదువే లేదు. మొబైల్స్‌లో ఐఫోన్ ఎలాగో.. బైకులలో బుల్లెట్ బైక్ కూడా అంతే.

Written by - Pavan | Last Updated : Dec 18, 2022, 08:16 PM IST
  • బుల్లెట్ బైక్ రైడర్స్ ఒంట్లో వణుకు పుట్టించే ఘటన
  • ఉన్నట్టుండి మంటల్లో చిక్కుకున్న బైక్
  • మంటలు చెలరేగి కాలిబూడిదైన బుల్లెట్ బైక్
Bullet Bike Caught Fire: తగలబడిన బుల్లెట్ బైక్.. వీడియో వైరల్

Bullet Bike Catches Fire: బుల్లెట్ బైక్ అంటే బైక్ రైడర్స్‌కి ఎంతో క్రేజ్. లాంగ్ రైడ్ వెళ్లాలన్నా.. టూ వీలర్ పై హుందాగా చక్కర్లు కొట్టాలనుకున్నా.. బుల్లెట్ బైక్ ని ఇష్టపడే వాళ్లే ఎక్కువ. పైగా బుల్లెట్ బైక్ ని ఒక స్టేటస్ సింబల్ గా భావించి బుల్లెట్ బైక్ కొనుగోలు చేసే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్లందరికీ వెన్నులో వణుకు పుట్టించే ఘటన ఇది. బుల్లెట్ బైక్ లో మంటలు చెలరేగి, ఆ బైక్ అగ్నికి ఆహుతైన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుని మెయింటెన్ చేయడాన్ని ఒక స్టేటస్ సింబల్‌గా భావించే వాళ్లకు కొదువే లేదు. మొబైల్స్‌లో ఐఫోన్ ఎలాగో.. బైకులలో బుల్లెట్ బైక్ కూడా అంతే. పైసా పైసా కూడబెట్టి బుల్లెట్ బైక్ కొనేవాళ్లు కూడా ఉంటారు. బుల్లెట్ బైక్‌కి ఉండే క్రేజ్ గురించి చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అలాంటి బుల్లెట్ బైక్ కళ్ల ముందే మంటల్లో చిక్కుకుని కళ్లలో కాలిబూడిదయితే ఎలా ఉంటుంది ? బైక్‌కి ఉండే క్రేజ్, బైక్ విలువ సంగతి పక్కనపెడితే.. బైక్ తగలబడిన దృశ్యం మాత్రం ప్రస్తుతం సామాజిక మార్గాల్లో వైరల్ అవడం చూసి బుల్లెట్ బైక్ యూజర్స్‌లో వణుకు పుడుతోంది. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్‌ సైకిల్‌ యూజర్ లడఖ్‌లోని నుబ్రా, పాంగాంగ్ ప్రాంతాల మధ్య పర్యటిస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డుకి ఒక పక్కన మోటార్ సైకిల్ పార్క్ చేసి ఉండగా.. ఉన్నట్టుండి ఎలక్ట్రిక్ స్టార్టర్ ఆన్ అయింది. అవడంతోనే బైకులో చిన్నపాటి కదలిక వచ్చి ఒక పక్కకు ఒరిగిపోయింది. ఆ వెంటనే మంటలు చెలరేగి అగ్నికీలల్లో చిక్కుకుంది. అక్కడే ఉన్న జనం మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ వృథా అయ్యాయి. బైక్ వైరింగ్ వ్యవస్థలో లోపం వల్లే స్పార్క్స్ వచ్చి.. అవే స్పార్క్స్ బైకులో మంటలు చెలరేగడానికి కారణమై ఉంటాయని ఈ వీడియో చూసిన నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో ట్రిప్పియోగి669 అనే యూజర్ అప్‌లోడ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా.. బుల్లెట్ బైక్ సేఫ్టీపై చర్చకు దారితీసింది.

ఇది కూడా చదవండి : Cockroach Found in Omelette: రైల్లో ఆహారం తింటున్నారా ? ఆమ్లెట్‌లో బొద్దింకపై ప్రధానికి ఫిర్యాదు

ఇది కూడా చదవండి : Bride and groom fighting: పెళ్లి మండపంలోనే జుట్టుపట్టుకొని పిచ్చకొట్టుడు కొట్టుకున్న వధూవరులు.. వీడియో వైరల్

ఇది కూడా చదవండి : Vahan Puja For Helicopter: యాదాద్రిలో అరుదైన దృశ్యం.. హెలీక్యాప్టర్‌కి వాహన పూజలు, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x