Milk For Diabetic Patient: మన దేశంలోనే కాకుండా మధుమేహం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతోంది. అయితే ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ప్రస్తుతం ఏం తినాలో, ఏం తినకూడదో అని తెలియక విచ్చల విడిగా ఇష్టమైన ఆహారాలు తింటున్నారు. దీంతో మధుమేహం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధితో బాధపడుతున్నవారు ఆహారంపై శ్రద్ధ వహించకపోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిల్లో మార్పులు సంభవించి మూత్రపిండాల సమస్యలు, గుండె జబ్బుల సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాధి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఈ పదార్థాలను పాలతో కలపి తాగండి:
1. పాలలో దాల్చిన చెక్క వేసుకుని తాగండి:
చెక్క దాల్చినచెక్క చాలా రుచికరమైన మసాలా దినుసులు. ఇది డయాబెటిక్ పేషెంట్లకు ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను అందించి రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రిస్తుంది. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
2. పాలు, బాదం పోడి:
బాదం పాలు కూడా శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్ ఇ, విటమిన్ డి, ప్రొటీన్, ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ బాదం పోడిని కలిపిన పాలను తాగడం వల్ల మధుమేహం ఉన్నవారికి రక్త పరిమాణాలు తగ్గి నియంత్రణలో ఉంటాయి.
3. పసుపు పాలు:
పసుపు పాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ పాలను ప్రతి రోజూ తాగడం వల్ల కూడా ఇన్సులిన్ స్థాయిల్లో మార్పులు సంభవించి రక్తంలో గ్లూకోజ్ పరిమాణాలను నియంత్రిస్తుంది. కాడట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పాలను ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Payal Ghosh : ఎన్టీఆర్ గురించి అప్పుడు చెబితే అంతా నవ్వారు.. పాయల్ ట్వీట్ వైరల్.. చెర్రీ ఫ్యాన్స్ ఫైర్
Also Read : Pooja Hegde Pics : అందుకే త్రివిక్రమ్ పాట రాయించుకున్నట్టున్నాడు.. పూజా హెగ్డే పిక్స్ వైరల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook