How To Make Peanut Hair Mask: ప్రతి ఒక్కరు అందమైన జుట్టును కోరుకుంటారు. అందమైన జుట్టును పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే ప్రతస్తుతం ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా వాతావరణంలో కలుష్యం పెరగడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జుట్టు హెల్తీగా ఉండడాని తప్పకుండా పలు రకాల ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వేరుశెనగలను కూడా ఆహారంలో తీసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని ఆహారంలోనే కాకుండా హెయిర్ మాస్క్‌లా కూడా వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణుతు తెలుపుతున్నారు.
వేరుశెనగ హెయిర్ మాస్క్ తయారీకి అవసరమైన పదార్థాలు:
>>వేరుశెనగ మిశ్రమం 1 కప్పు
>>విటమిన్-ఇ 2 క్యాప్సూల్స్
>>కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్
పీనట్ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి?
>>వేరుశెనగ హెయిర్ మాస్క్ చేయడానికి.. ముందుగా వేరుశెనగలను పొట్టును తీయండి.
>>తర్వాత వేరుశెనగలను గ్రైండర్లో మెత్తగా మెత్తగా పేస్ట్ చేయాలి.
>>ఆ తర్వాత ఈ పేస్ట్‌లో కొబ్బరి నూనె, విటమిన్-ఇ క్యాప్సూల్‌ను పంక్చర్ చేసి ఉంచండి.
>>తర్వాత వీటన్నింటిని బాగా కలిపి మాస్క్‌ని తయారు చేసుకోండి.
>>ఇప్పుడు పీనట్ హెయిర్ మాస్క్ సిద్ధంగా ఉంటుంది.
వేరుశెనగ హెయిర్ మాస్క్ ఎలా అప్లై చేయాలి?
వేరుశెనగ హెయిర్ మాస్క్‌ను అప్లై చేసే ముందు మీ జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీ జుట్టు లోపలి దాకా ఆ మిశ్రమాన్న అప్లై చేయాల్సి ఉంటుంది.
అంతేకాకుండా ఈ మాస్క్‌ను మీ జుట్టుకు సుమారు 30 నిమిషాలు ఉంచండి.
ఆ తర్వాత షాంపూని అప్లై చేయకుండా మీ జుట్టును బాగా కడిగి శుభ్రం చేసుకోండి.
Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్
Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook