Dragon Fruit For Diabetes: డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారు రోజూ తీసుకునే ఆహారాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. లేకపోతే ఇదే సమస్య కూడా ప్రాణాంతకంగా మారే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించడానికి తప్పకుండా పలు రకాల పండ్లను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్స్‌ను కూడా ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందించడమేకాకుండా మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.
డ్రాగన్ ఫ్రూట్‌లో చాలా రకాల పోషకాలుయ లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ప్రతి రోజు మధుమేహం ఉన్నవారు తీసుకుంటే రక్తంలో సులభంగా చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. 100 గ్రాములలో ఈ పండులో 60 గ్రాముల ఆరోగ్యకరమైన కేలరీలు, 1.2 గ్రాముల ప్రోటీన్, జీరో ఫ్యాట్, 13 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్ లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ప్రతి రోజూ తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరం నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం కూడా లభిస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్‌ను ఎక్కువగా దక్షిణ మెక్సికో, మధ్య అమెరికా దేశాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. అయితే దీనిని ఆహారంలో భాగంగా ప్రతి రోజూ చేర్చుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజూ ఈ పండును తీసుకోవాల్సి ఉంటుంది.
డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిని ఎలా తగ్గిస్తుంది?
డ్రాగన్ ఫ్రూట్ ఒక కాక్టస్ జాతికి చెందిన మొక్క. అనేక జంతువుల ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగించి పరిశోధనలు చేయగా.. ఇది యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉత్పత్తి చేస్తుందని తేలింది. కాబట్టి దీనిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడమే కాకుండా..ఊబకాయాన్ని కూడా నియంత్రింస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రీడయాబెటిస్, టైప్-2 మధుమేహాన్ని సులభంగా తగ్గిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe