Alia Bhatt Pink Lips: అలియా భట్ లాంటి పింక్‌ లిప్స్‌ కోసం ఇలా చేయండి చాలు..

How To Get Naturally Pink Lips: పెదాల రంగు బాగుంటే ముఖం అందంగా తయారవుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల చిట్కాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ చిట్కాలను పాటించడం వల్ల పెదాలు రంగు కూడా మారుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2023, 03:13 PM IST
Alia Bhatt Pink Lips: అలియా భట్ లాంటి పింక్‌ లిప్స్‌ కోసం ఇలా చేయండి చాలు..

How To Get Naturally Pink Lips: ప్రస్తుతం చాలా మందిలో పెదవులు అందహీనంగా తయారవుతున్నాయి. అయితే దీనిని కవర్‌ చేయడానికి  లిప్‌స్టిక్‌తో పెదవులను కప్పి ఉంచుతున్నారు. కొన్ని సార్లు ఈ లిప్‌స్టిక్‌ చెంపలకు అంటుతూ ముఖం మెరిసేలా తయారవుతుంది. దీంతో ఫేస్‌ మొత్తం అందహీనంగా తయారవుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బాలీవుడ్ నటి అలియా భట్ తన పెదవులను రక్షించుకోవడానికి ఉపయోగించే పలు రకాల చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను వినియోగించడం వల్ల అలియా భట్ లాగా సహజంగా పింక్ పెదాలను పొందవచ్చు.

సహజంగా పెదవులు పూర్తిగా నల్లగా ఉన్నవారికి గులాబీ రంగు తీసుకురావడం చాలా కష్టం. కానీ చాలా మంది స్త్రీలకి చిన్నతనంలో గులాబీ రంగులో పెదవులు ఉంటాయి. కానీ కాలం గడిచేకొద్దీ వారి పెదాల రంగు కూడా సులభంగా మారుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా చిన్నతనంలో ఉన్న గులాబి రంగులోకి తీసుకురావొచ్చు. అయితే దీని కోసం ఎలాంటి చిట్కాలను వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పెదవులు నల్ల రంగులోకి మారడానికి ప్రధాన కారణాలు ఇవే:

1. గాయం కారణంగా రక్తం గడ్డకట్టడం.
2. విటమిన్ లోపం.
3. రక్తం తక్కువగా ఉండడం.
4. సైటోటాక్సిక్ మందులు.
5. అడిసన్స్ వ్యాధి.
6. గర్భం.

పెదాలను గులాబీ రంగులోకి ఎలా వస్తాయి?:

1. హైడ్రేటెడ్‌గా ఉండండి:
శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ప్రతి రోజూ ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. దీని వల్ల పెదాలు పొడిబారవు, పగుళ్లు రావు. అంతే కాకుండా పెదవుల రంగు మారడం కూడా మారుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

2. కలబంద, తేనె:
కలబంద జెల్‌ని, తేనెను ఒక గిన్నెలో కలిపి పెదాలకు అప్లై చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా మీరు పెదాల రంగు మారడం చూడొచ్చు. అంతేకాకుండా పెదాలు పగలకుండా తయారవుతుంది. కాబట్టి పెదాలు మృదువుగా, గులాబీ రంగులోకి మారడానికి తప్పకుండా ఈ చిట్కాను వినియోగించాల్సి ఉంటుంది.  

3. బీట్‌రూట్ రసం:
బీట్‌రూట్ రసం కూడా పెదాలకు ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పెదాల రంగు మారడానికి సహాయపడతాయి. అయితే దీని కోసం బీట్‌రూట్‌ను తొక్క తీసి దాని రసాన్ని తీయండి. ఆ తొక్కలను మీ వేళ్ల సహాయంతో పెదవులపై అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే త్వరలోనే మంచి ఫలితం పొందుతారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 

Trending News