Sakat Chauth 2023: ప్రతి సంవత్సరం మాఘ కృష్ణ పక్ష సంకష్టి చతుర్థి రోజున గణేష్ చతుర్థి వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. అయితే ఈ క్రమంలో ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేంకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ వ్రతాన్ని పాటించడం వల్ల పిల్లలకు దీర్ఘాయువు, ఆనందం, అదృష్టం, శ్రేయస్సు కూడా లభిస్తుంది. ఈ సంకష్టి చతుర్థిని మాఘ చతుర్థి అని కూడా అంటారు. అయితే ఇలా ఉపవాసాలు పాటించడం పురాణాల నుంచి వస్తోంది. సంకష్టి చతుర్థి రోజున గణేశుడిని పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని ప్రజల విశ్వాసం.
పురాణాల ప్రకారం.. కార్తికేయుడు తన తల్లి పార్వతిని కలవడానికి ఇదే రోజున ఉపవాసాలు పాటించాడని.. దీని కారణంగా కార్తికేయుడు ఉపవసం పాటించడంతో అమ్మ అనుగ్రహం, ప్రసన్నం లభిస్తుంది. అంతేకాకుండా ప్రతి నెలలో రెండ పక్షం ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రతి నెలలో చతుర్థి తిథి అత్యంత పుణ్యమైన తిథిగా పరిగణిస్తారు.
సంకష్టి చతుర్థి రోజున గణేషున్ని భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసాలు పాటించడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుందని అంతేకాకుండా సంతానం కూడా కలుగుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ వ్రతాన్ని చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు. ముఖ్యంగా మాఘ కృష్ణ పక్ష చతుర్థి తిథి రోజున ఉపవాసం పాటిస్తే రెట్టింపు ప్రయోజనాలు కూడా పొందే ఛాన్స్ ఉందని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి నెల సంకష్టి చతుర్థిని వ్రతాన్ని చేయడం వల్ల అదృష్టాన్ని కూడా పొందుతారు.
సంకష్టి చతుర్థి పూజ శుభ ముహూర్తం:
ఈ సంవత్సరం సంకష్టి చతుర్థి మాఘ కృష్ణ పక్ష చతుర్థి తిథిన 10 జనవరి 2023 మంగళవారం (ఈ రోజు) వచ్చింది. ఈ వ్రతాన్ని మంగళవారం నాడు ఆచరించడం వల్ల వల్ల ఆర్థిక సమస్యలేకాకుండా మనిషిక సమస్యలు కూడా తగ్గుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే పురాణాల ప్రకారం గణపతి ఈ రోజున జన్మించాడని నమ్ముతారు. ఈ సంవత్సరం చతుర్థి తిథి జనవరి 10వ తేదీ ఉదయం 9.34 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే జనవరి 11వ తేదీ ఉదయం 11.23 గంటలకు ముగుస్తుంది.
Also read: AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ
Also read: AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook