Waltair Veerayya Day 2: రెండో రోజు సగానికి సగం తగ్గిన కలెక్షన్స్.. అయినా ఎక్కడా తగ్గని వీరయ్య!

Waltair Veerayya Day 2 Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ ప్రధాన పాత్రలో బాబీ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా రెండు రోజుల కలెక్షన్స్ మీద ఒక లుక్కు వేద్దాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 15, 2023, 04:02 PM IST
Waltair Veerayya Day 2: రెండో రోజు సగానికి సగం తగ్గిన కలెక్షన్స్.. అయినా ఎక్కడా తగ్గని వీరయ్య!

Waltair Veerayya Day 2 Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ ప్రధాన పాత్రలో రూపొందించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శృతిహాసన్, కేథరిన్ తెరెసా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో భారీ తారాగణం కూడా నటించింది. ఇక ఈ సినిమా మొదటి రోజు వసూళ్లతో పోలిస్తే రెండవ రోజు వసూళ్లలో భారీ డ్రాప్ కనిపించింది. వాస్తవానికి ఈ సినిమా మొదటిరోజు 22 కోట్ల 90 లక్షల షేర్ వసూలు చేస్తే రెండవ రోజు 11 కోట్ల 95 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది.

ఒకరకంగా చూసుకుంటే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు గాను 34 కోట్ల 85 లక్షల షేర్ 55 కోట్ల 90 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా నైజాంలో రెండవ రోజు నాలుగు కోట్ల 96 లక్షల షేర్ సీడెడ్ లో రెండు కోట్ల 45 లక్షల షేర్ వసూలు చేసింది. ఉత్తరాంధ్రలో కోటి 44 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 88 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 36 లక్షలు, గుంటూరు జిల్లాలో 67 లక్షలు వసూలు చేసింది. కృష్ణా జిల్లాలో 80 లక్షలు వసూలు చేసిన వాల్తేరు వీరయ్య సినిమా నెల్లూరు జిల్లాలో 36 లక్షలు వసూలు చేసి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు 11 కోట్ల 95 లక్షల షేర్, 20 కోట్ల 10 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది.

మొత్తం గా చూసుకుంటే రెండు రోజులకు గాను నైజాం ప్రాంతంలో 11 కోట్ల ఆరు లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 6 కోట్ల 68 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో నాలుగు కోట్ల 1 లక్ష, ఈస్ట్ గోదావరి జిల్లాలో మూడు కోట్ల 56 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రెండు కోట్ల 42 లక్షలు, గుంటూరు జిల్లాలో మూడు కోట్ల 42 లక్షలు, కృష్ణా జిల్లాలో రెండు కోట్ల 29 లక్షలు, నెల్లూరు జిల్లాలో కోటి 41 లక్షలు సాధించింది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు కలిపి 34 కోట్ల 85 లక్షలు షేర్, 55 కోట్ల 90 లక్షల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా కర్ణాటక సహా మిగతా భారతదేశం మొత్తంలో రెండు కోట్ల 90 లక్షల షేర్, ఓవర్సీస్ లో ఆరు కోట్ల 15 లక్షల షేర్ సాధించింది. ఆ లెక్కన చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల 90 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా 75 కోట్ల 50 లక్షల గ్రాస్ వసూలు చేసింది. సినిమా ఓవరాల్ గా 88 కోట్లు బిజినెస్ చేయడంతో 89 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు. ఇంకా సినిమాకి 45 కోట్ల 10 లక్షలు వస్తే బ్రేక్ ఈవెన్ అయి హిట్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పండుగ సీజన్ సినిమాకు కలిసి రావడంతో పాటు పాజిటివ్ టాక్ కూడా రావడంతో అదేమీ పెద్ద విషయం కాదు అంటున్నారు విశ్లేషకులు.

నోట్: ఈ వివరాలు వివిధ ఆన్ లైన్ వేదికల ద్వారా మేము సేకరించినవి, వీటిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు. 

Also Read: Veera Simha Reddy Collections: మూడో రోజు పుంజుకున్న 'వీర సింహా రెడ్డి'.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కొల్లగొట్టాలో తెలుసా?

Also Read: Roja Slams Balakrishna: ఏపీ ప్రభుత్వం మీద డైలాగులు..బాలయ్యపై రోజా ఫైర్.. చంపించాలని చూశారంటూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News