Insurance Plans: గ్యారంటీ ఇన్సూరెన్స్ పాలసీకు, సాధారణ బీమాకు తేడాలేంటి

Insurance Plans: స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది పాలసీ హోల్డర్ల మరణానంతరం కుటుంబసభ్యులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూర్చుతుంది. అదే గ్యారంటీ ఇన్సూరెన్స్ పాలసీలో పాలసీ హోల్డర్‌కు భీమా కవరేజ్‌తో పాటు పాలసీ మెచ్యూరిటీ రిటర్న్ కూడా లభిస్తుంది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 22, 2023, 10:33 AM IST
Insurance Plans: గ్యారంటీ ఇన్సూరెన్స్ పాలసీకు, సాధారణ బీమాకు తేడాలేంటి

ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడూ ఇన్వెస్ట్‌మెంట్ కానే కాదు. ఎవరైనా వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబసభ్యుల భవిష్యత్ సురక్షితం చేసే ఓ మాధ్యమం. అదే బీమా పాలసీను ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా మారితే ఎలా ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

అదే గ్యారంటీ రిటర్న్ బీమా పథకం. పాలసీ హోల్డర్లకు బీమా కవరేజ్‌తో పాటు పాలసీ హోల్డర్లకు గ్యారంటీ రిటర్న్ అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే గ్యారంటీ రిటర్న్ బీమా పాలసీ తీసుకోండి. స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీ పాలసీ హోల్డర్లు చనిపోతే వారి కుటుంబసభ్యులకు పెద్దమొత్తంలో డబ్బు అందిస్తుంది. అదే గ్యారంటీ రిటర్న్ బీమా పాలసీలో పాలసీ హోల్డర్‌కు బీమా కవరేజ్‌తో పాటు పాలసీ మెచ్యూరిటీ అయ్యాక..గ్యారంటీ రిటర్న్ కూడా అందిస్తుంది. 

ఇది తక్కువ రిస్క్ ఉన్న ఇన్వెస్ట్‌మెంట్. మార్కెట్‌లో ఎగుడుదిగుడులు ఉన్నా మీకు స్థిరమైన రిటర్న్ ఇస్తుంది ఈ పాలసీ. ఎందుకంటే రిస్క్ తక్కువ, రిటర్న్ కూడా మిగిలిన పథకాలతో పోలిస్తే తక్కువే. ఇందులో రెండూ సంపూర్ణంగా లభిస్తాయి. ఒకటి భీమా కవరేజ్, రెండవది భవిష్యత్తులో మీ పెట్టుబడిపై స్థిరమైన రిటర్న్. ఏదైనా దురదృష్టకర ఘటనలో పాలసీ హోల్డర్ కుటుంబసభ్యులకు పూర్తి బీమా మొత్తం లభిస్తుంది.

పాలసీహోల్డర్ ఇష్టానుసారం ఆ డబ్బుల్ని ఒకేసారి లేదా నెలవారి పెన్షన్ రూపంలో తీసుకోవచ్చు. నెలవారీ ఆదాయం కోసం చూసేవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం కాగలదు. గ్యారంటీ రిటర్న్ పాలసీ అనేది పాలసీ హోల్డర్లకు ట్యాక్స్ ప్రయోజనం కూడా కల్పిస్తోంది. ఇన్‌కంటాక్స్ శాఖ సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ పేయర్ల ప్రీమియంపై ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. మెచ్యూరిటీ మొత్తంపై మినహాయింపు వర్తిస్తుంది. అయితే ఇలాంటి బీమా పాలసీలు కాస్త ఖరీదైనవిగా ఉంటాయి. అంటే నెలకు లేదా ఏడాదికి వీటిపై ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

Also read: Pancard Updates: ఆ చిన్న పొరపాటు చేస్తే మీ పాన్‌కార్డు నిష్ప్రయోజనమే, తస్మాత్ జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News