CM Jagan: ఏపీలో రోడ్లకు సరికొత్త రూపురేఖలు.. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

CM Jagan Review On R and B Department: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఉన్న రోడ్లన్నీ పూర్తిగా బాగు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏపీసీఎం ఎంఎస్‌ యాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2023, 04:56 PM IST
  • రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష
  • ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీ వాడేందుకు ఒకే
  • ఏపీసీఎం ఎంఎస్‌ యాప్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
CM Jagan: ఏపీలో రోడ్లకు సరికొత్త రూపురేఖలు.. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

CM Jagan Review On R and B Department: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయడంతోపాటు.. కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్లీ రెండేళ్లకే రిపేర్లకు వచ్చే అవకాశం ఉండకూడదన్నారు. రోడ్డు వేసిన తరువాత కనీసం ఏడేళ్లపాటు పాడవ్వకుండా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ కూడా పూర్తిచేయాలని సూచించారు. ఆర్‌ అండ్‌ బీ శాఖపై తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. 

ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో నేల స్వభావం రీత్యా రోడ్లు త్వరగా పాడైపోతున్నాయని.. భారీ వాహనాలు తిరిగే సరికి కుంగిపోతున్నాయని అధికారులు తెలిపారు. ఇలాంటి చోట్ల పుల్ డెప్త్ రిక్లమేషన్‌ (ఎఫ్‌డీఆర్‌) టెక్నాలజీని వాడాలని ప్రతిపాదించారు. ఈ టెక్నాలజీకి సీఎం జగన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఖర్చు ఎక్కువైనా.. నాణ్యత బాగుంటుందన్నారు ముఖ్యమంత్రి.

'మొదటి దశలో వెయి కిలోమీటర్ల మేర ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీతో చేపట్టాలి. వచ్చే జూన్, జులైకల్లా ఈ పద్ధతిలో నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేయాలి. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను కూడా పూర్తిచేయాలి. కడప, బెంగళూరు రైల్వేను లైనుపై దృష్టిపెట్టాలి. విశాఖ నుంచి భోగాపురానికి వెళ్లే రోడ్డు నిర్మాణంపైనా దృష్టిపెట్టాలి. రోడ్లు బాగు చేసిన తర్వాత నాడు–నేడు ద్వారా ప్రజల ముందు పెట్టాలి. ఇంత ఖర్చుచేసి రోడ్లు బాగుచేస్తున్నా నెగిటివ్‌ ప్రచారం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలో నాడు–నేడు శీర్షిక కింద మనం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలి. ఆయా ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లలో కూడా ఈ వివరాలు ఉంచాలి.' అని సీఎం జగన్ సూచించారు.  

పట్టణాలు, నగరాల్లో ఎప్పటికప్పుడు రోడ్ల రిపేర్లను చేసేందుకు ఉద్దేశించిన ఏపీసీఎం ఎంఎస్‌ యాప్‌ను సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా రోడ్లకు సంబంధించి స్థానిక ప్రజా ప్రతినిధులు, పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. యాప్‌ ద్వారా దీనికి సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్‌ చేయవచ్చు. జియో కోఆర్డినేట్స్‌తో పాటుగా ఫిర్యాదు నమోదు చేస్తారు. దీనిపై కమాండ్‌ కంట్రోల్‌ రూం కూడా ఏర్పాటు చేసి.. ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని వెంటనే పరిష్కార దిశగా చర్యలు ఉండనున్నాయి.

పట్టణాలు, నగరాల్లో రోడ్ల మరమ్మతులు నాణ్యతతో జరగాలని సీఎం జగన్ సూచించారు. ఎక్కడైనా ఫలానా చోట రోడ్డు  రిపేరు చేయాలని పౌరుడు ఫిర్యాదుచేసిన 60 రోజుల్లో దాన్ని బాగు చేయాలని ఆదేశించారు. ఈ లక్ష్యాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. యాప్‌ పనితీరు, అందులో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై నిరంతరం సమీక్ష, పర్యవేక్షణ ఉండాలన్నారు. ఇకపైన కూడా రోడ్ల నిర్వహణలో గణనీయమైన మార్పులు రావాలని చెప్పారు.

Also Read: Republic Day 2023: రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధం.. తొలిసారి పరేడ్‌లో ఆ విమానం  

Also Read: ICC Awards: ఐసీసీ టీ20 అత్యుత్తమ జట్టు ప్రకటన.. భారత్ నుంచి ముగ్గురికి చోటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News