Nandamuri Balakrishna - Anasuya Bharadwaj : అనసూయపై ఫోకస్ పెట్టిన బాలయ్య.. యాంకర్ రిప్లై వైరల్

Balakrishna on Anasuya Bharadwaj నందమూరి బాలకృష్ణ తాజాగా మైఖేల్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో బాలకృష్ణ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ట్రైలర్ చూస్తూ అనసూయ కదా? అనసూయ ఉందా? అంటూ అడిగేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2023, 05:18 PM IST
  • నెట్టింట్లో మైఖేల్ ట్రైలర్ సందడి
  • రిలీజ్ చేసిన నందమూరి బాలకృష్ణ
  • యాంకర్ అనసూయపై బాలయ్య ఫోకస్
Nandamuri Balakrishna - Anasuya Bharadwaj : అనసూయపై ఫోకస్ పెట్టిన బాలయ్య.. యాంకర్ రిప్లై వైరల్

Anasuya Bharadwaj in michael trailer సందీప్ కిషన్ హీరోగా మైఖెల్ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. అనసూయ సైతం ఎమోషనల్ రోల్‌లో కనిపిస్తోంది. ఈ ట్రైలర్‌ను కాసేపటి క్రితమే బాలయ్య రిలీజ్ చేశాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రైలర్ రిలీజ్ చేసిన బాలయ్య.. తెగ ఎగ్జైట్ అవుతూ వచ్చాడు. ట్రైలర్ ప్రారంభం అయిన తరువాత అందులో అనసూయ కనిపించింది. ఆమె అనసూయ కదా? అనసూయ ఉందా? ఇందులో అని బాలయ్య అడిగాడు. అవునండి.. ఇందులో అనసూయ ఉంది.. వరలక్ష్మీ గారు కూడా ఉన్నారు అని చెబుతారు. ఓహో వరలక్ష్మీ కూడా ఉందా? అని బాలయ్య ఎంతో ఆసక్తిగా ట్రైలర్ చూస్తాడు.

ఇక అలా ట్రైలర్‌లో బాలయ్య తన పేరుని పిలవడంతో అనసూయ స్పందించింది. అవును బాలయ్య బాబు గారు.. నేనున్నాను.. అంటూ మురిసిపోయింది. ఇక ఈ ట్రైలర్ మాత్రం ఫుల్ ప్యాక్డ్‌గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. సందీప్ కిషన్ నటన, లాస్ట్ షాట్, సిక్స్ ప్యాక్ లుక్ అన్నీ కూడా అదిరిపోయాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News