Sindhooram Movie Review And Rating సిందూరం టైటిల్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. పోలీసులు కరెక్టా? నక్సలైట్లు కరెక్టా? అంటూ కృష్ణవంశీ ప్రేక్షకుడి ఊహకే వదిలేశాడు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ సిందూరం సినిమాలో మేకర్లు ఏం చూపించారు. దర్శకుడు తాను అనుకున్న పాయింట్‌ను జనాలకు చేరవేశారా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.
కథ
సిందూరం కథ అంతా కూడా 2003 ప్రాంతంలో జరుగుతుంది. శ్రీరామగిరి ఎజెన్సీ ఏరియాలో పెత్తందార్లు, భూస్వామ్యుల ఆగడాలు, దానిపై సింగన్న దళం (శివ బాలాజీ) చేసే పోరాటల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అలాంటి సమయంలో ఎమ్మార్వోగా శిరీష రెడ్డి (బ్రిగిడ సాగా) శ్రీరామగిరికి వస్తుంది. అక్కడి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఆమెకు తోడు కాలేజ్ ఫ్రెండ్ రవి (ధర్మ) ఉంటాడు. కానీ ధర్మ నక్సలైట్ ఇన్‌ఫార్మర్. ఊర్లో జరిగే జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా తన అన్న ఈశ్వరయ్య చనిపోవడంతో ఎమ్మార్వోగా ఉన్న శిరీష పోటీ చేయాల్సి వస్తుంది. కానీ అది సింగన్న దళానికి నచ్చదు. శిరీషను సింగన్న దళం ఏం చేసింది? చివరకు రవి ఏం చేశాడు? అసలు ఈశ్వరయ్యను చంపింది ఎవరు? చివరకు రవి తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేది థియేటర్లో చూడాల్సిందే.
నటీనటులు
సిందూరం కథకు బ్రిగిడ సాగా బ్యాక్ బోన్‌లా నిలిచింది. ఆమె పాత్ర ఎంతో బరువుగా అనిపిస్తున్నా కూడా శిరీషగా బ్రిగిడ చక్కగా, హుందాగా నటించింది. ఇక రవి కారెక్టర్‌లో ధర్మ ఎమోషన్స్ చక్కగా పలికించాడు. క్లైమాక్స్‌లో రవి పాత్రలో ధర్మ చెప్పిన డైలాగ్స్, చేసిన యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. నూతన నటుడిగా పరిచయం అయిన ధర్మ బాగా నటించాడు. వీరి జోడి కూడా తెరపై చక్కగా కుదిరింది. శివ బాలాజీ చాలా కొత్తగా అనిపిస్తాడు. ఈశ్వరయ్య పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలోని పళనియప్పన్, సెబాస్టియన్ ఇలా చాలా పాత్రలు ప్రేక్షకులకు గుర్తుంటాయి. చిరు అభిమానిగా జోష్ రవి నవ్వించే ప్రయత్నం చేశాడు. అలా సినిమాలోని పాత్రలన్నీ తమ పరిధి మేరకు నటించాయి.
విశ్లేషణ
సిందూరం లాంటి కథను చెప్పడం అంత సులువైన పనేమీ కాదు. నక్సలైట్, ప్రభుత్వం అనే కాన్సెప్టులు, అందులో పోలీస్ వ్యవస్థ మీద ఉండే విమర్శలను చూపించడం అంటే కత్తి మీద సామే. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పడం అంత సులభం కాదు. కానీ ఇందులో మాత్రం దర్శకుడు ఆ సాహసం చేసినట్టుగా అనిపిస్తుంది. నక్సలైట్ వ్యవస్థలోని లోపాలు, కమ్యూనిజం ముసుగులో జరిగే అరాచకాల గురించి చెప్పేశాడు.
హిట్లర్, స్టాలిన్ అంటూ గొప్పగా చెప్పుకునే వారు.. ఎన్నో కోట్ల మంది ప్రాణాలను తీశారంటూ నాటి చరిత్రను రీసెర్చ్ చేసి చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఈ సినిమా కోసం బాగానే రీసెర్చ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. కమ్యూనిజం గురించి హీరోయిన్ చేత చెప్పించిన డైలాగ్స్ బాగుంటాయి. పాటలు వినసొంపుగా ఉంటాయి.
2000 నాటి వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించడంలో కెమెరాపనితనం కనిపిస్తుంది. ప్రథమార్థం కాస్త స్లోగా అనిపించినా.. ద్వితీయార్థంలో సినిమా మెప్పిస్తుంది. ఇక చివర్లో వచ్చే ట్విస్టులు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. మేకింగ్ పరంగా నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. సినిమాను ఎంతో నిజాయితీగా తీసినట్టు కనిపిస్తుంది. ఎర్రజెండా ప్రేమికులు నొచ్చుకునేలా కొన్ని సీన్లు ఉండటం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
రేటింగ్ : 2.75
బాటమ్ లైన్ : ఎర్రజెండాపై విమర్శలే సిందూరం
Also Read: Naatu Naatu oscar Nominations : టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం.. నామినేట్ అయిన నాటు నాటు
Also Read: Pawan Kalyan's Fan Death News: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. అభిమాని మృతి, ముగ్గురికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి