రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 2023 బ్యాంకు సెలవుల జాబితా ప్రకటించింది. వచ్చే నెలలో బ్యాంకులకు పది రోజులు సెలవులున్నాయని ఆర్బీఐ తెలిపింది. ఈ పదిరోజుల సెలవుల్లో శని, ఆదివారాలు కలిపి ఉన్నాయి.
ఆర్బీఐ జారీ చేసిన ఫిబ్రవరి సెలవుల జాబితా దేశవ్యాప్తంగా ఒకేలా ఉండదు. రాష్ట్రాల్ని బట్టి మారుతుంటుంది. ఆర్బీఐ నిర్దేశిత గైడ్‌లైన్స్ ప్రకారం ఫిబ్రవరిలో బ్యాంకు సెలవుల జాబితా విడుదలైంది. ఇందులో పబ్లిక్ హాలిడేస్‌తో పాటు ప్రాంతీయ హాలిడేస్ కూడా ఉన్నాయి.
ఫిబ్రవరి 2023లో బ్యాంకు హాలిడేస్
ఫిబ్రవరి 5 ఆదివారం
ఫిబ్రవరి 11 రెండవ శనివారం
ఫిబ్రవరి 12 ఆదివారం
ఫిబ్రవరి 15 ఇంఫాల్‌లో సెలవు
ఫిబ్రవరి 18 ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, బేలాపుర్, భోపాల్, భువనేశ్వర్, రాయ్‌పూర్, రాంచీ, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, తిరువనంతపురం, కొచ్చి, లక్నో, నాగ్‌పూర్, షిమ్లా, శ్రీనగర్‌లో మహా శివరాత్రి సెలవు
ఫిబ్రవరి 19 ఆదివారం
ఫిబ్రవరి 20 మిజోరాంలో సెలవు
ఫిబ్రవరి21 సిక్కింలో లోసార్ సెలవు
ఫిబ్రవరి 25 నాలుగవ శనివారం
బ్యాంకులకు పది రోజులపాటు సెలవులున్నా..ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తాయి. నేరుగా బ్యాంకు సేవలు మాత్రం జరగవు. ఆన్లైన్ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook