కొలెస్ట్రాల్ శరీరానికి ఎంత అవసరమో అంతే ప్రమాదకరం కూడా. పరిమితి దాటితే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. ఇందులో రెండు గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ రెండుంటాయి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డీఎల్ పెరిగినప్పుడు అది కాస్తా నాళికల్లోపేరుకుపోతుంటుంది. దీనివల్ల రక్త సరఫరాలో ఇబ్బంది కలుగుతుంది. చాలాసార్లు హై కొలెస్ట్రాల్ కారణంగా బ్లడ్ క్లాటింగ్ సమస్యకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని నివారించేందుకు ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు తీసుకోవడమే కాకుండా లైఫ్‌స్టైల్ బాగుండేట్టు చూసుకోవాలి. శరీరంలో కొన్ని లక్షణాలతో అప్రమత్తం కావాలి.
కొలెస్ట్రాల్ పెరిగితే కన్పించే వార్నింగ్ సైన్స్ ఇవే
అధిక రక్తపోటు
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు నేరుగా అధిక రక్తపోటుగా మారుస్తుంది. రక్తంలో కొవ్వు ఎంత ఎక్కువగా ఉంటే..అంత సమస్య ఉంటుంది. దాంతో రక్త సరఫరాలో ఇబ్బంది ఏర్పడి..రక్తం గుండె వరకూ చేరదు. రక్త నాళికలపై ఒత్తిడి పెరుగుతుంటుంది.
కాళ్లు తిమ్మిరి పట్టడం
కాళ్లు తిమ్మిరి పట్టడం కన్పిస్తే ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. చెడు కొలెస్ట్రాల్‌కు సంకేతం కావచ్చు. ఆర్టరీస్ ద్వారా రక్తం సరఫరా, ఆక్సిజన్ సరఫరాలో సమస్య రావచ్చు. దీనివల్ల కాళ్ల నొప్పి సమస్యలు పెరుగుతాయి.
గోరు రంగు మారడం
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్య పెరిగినప్పుడు ధమనుల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల రక్త నాళికల్లో రక్త ప్రవాహానికి అవరోధం ఏర్పడుతుంది. చేతులు, కాలి వేళ్ల వరకూ రక్త సరఫరాలో ఇబ్బంది ఏర్పడి..గోర్ల రంగు గులాబీ నుంచి పసుపుగా మారుతాయి. కొలెస్ట్రాల్ పెరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు.
Also read: World Cancer Day Symptoms: శరీరంలో ఈ లక్షణాలు కన్పిస్తే..అప్రమత్తం కావల్సిందే, కేన్సర్ కారకం కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook