White King Cobra Drinking Water Video got Viral: పాములు నీటిని త్రాగుతాయా..? లేదా..? అన్న అనుమానం చాలా మందిలో ఉంటుంది. కొన్ని ప్రత్యేక పండగల సందర్భాల్లో నాగు పాములు పాలు తాగయని మనం వార్తలు చదువుతాం. అయితే వీడియోస్ మాత్రం చాలా అరుదుగా చూస్తుంటాం. ప్రమాదకరమైన కింగ్ కోబ్రా కూడా నీటిని త్రాగుతుంది. ఇందుకు ప్రూఫ్ కూడా ఉంది. కింగ్ కోబ్రా నీరు త్రాగే వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వరుసగా వారం రోజులు పాటు చేపల వలలో చిక్కుకున్న ఆ కింగ్ కోబ్రా నీటిని గడగడా తాగేసింది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఒడిశాలోని పరిసర ప్రాంతంలో చెరువు నుంచి చాపలు బయటికి పోకుండా కాలువలో వల నాటారు. ఈ వలలో భారీ కింగ్ కోబ్రా చిక్కుకుపోయింది. ఇది చూసిన జనాలు కింగ్ కోబ్రాను బయటికి తీసేందుకు బయపడి.. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందలేదు. వారం తర్వాత స్నేక్ క్యాచర్ మీర్జా ఎండీ ఆరిఫ్ విషయం తెల్సుకుని అక్కడికి వచ్చాడు. కింగ్ కోబ్రాను చూసిన స్నేక్ క్యాచర్ చలించిపోయాడు. ఆకలి, దాహంతో ఉన్న పాము పరిస్థితి విషమించింది.
స్నేక్ క్యాచర్ మీర్జా ఎండీ ఆరిఫ్ వలను కాస్త చించి కింగ్ కోబ్రాకు బాటిల్ సహాయంతో నీరు తాగిపించాడు. 7 రోజులుగా ఉచ్చులోనే ఉండడంతో కింగ్ కోబ్రా గడగడా నీటిని తాగేసింది. అనంతరం పాముకు చిక్కుకున్న వలను పూర్తిగా తీసి.. దాన్ని వదిలేశాడు. ఆకలితో అలమటించిన ఆ పాము నిస్సయక స్థితిలో వేగంగా కదలలేకపోయింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన అందరూ కింగ్ కోబ్రా పరిస్థితి చూసి చలించిపోతున్నారు.
మీర్జా ఎండీ ఆరిఫ్ ఒడిశాలో ఫేమస్ స్నేక్ క్యాచర్. ఎంత పెద్ద విషసర్పాలను అయినా సునాయాసంగా పట్టుకుంటాడు. అది కింగ్ కోబ్రా అయినా వెనుకాడడు. ఎలాంటి పరికరాల సాయం లేకుండా ఒట్టిచేతులతోనే పాములను పట్టుకుంటాడు. ఒడిశా రాష్ట్రం బాలాసోర్ పరిసర ప్రాంతంలో ఇప్పటికే ఎన్నో కింగ్ కోబ్రాను అతడు రక్షించాడు. ఈ క్రమంలోనే 7 రోజులుగా ఉచ్చులోనే ఉన్న కింగ్ కోబ్రాను మీర్జా ఎండీ ఆరిఫ్ కాపాడాడు.
Also Read: iPhone 15 Price: ఐఫోన్ 15 ప్రో డీటెయిల్స్ లీక్.. మొదటిసారిగా సరికొత్త ఫీచర్! సూపర్ లుకింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి