మనిషి శరీరానికి చాలా న్యూట్రియంట్లు అవసరమౌతుంటాయి. ఈ న్యూట్రియంట్లలో ఏ ఒక్కటి లోపించినా శరీరం సరిగా పనిచేయదు. శరీరానికి అవసరమైన పోషకాల్లో ముఖ్యమైంది ప్రోటీన్. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రోటీన్లు చాలా అవసరం. ప్రోటీన్లు లోపిస్తే ఏం జరుగుతుందో పరిశీలిద్దాం..
ప్రోటీన్లు శరీరంలో మజిల్స్, స్కిన్, ఎంజైమ్స్, హార్మోన్స్ అభివృద్ధికి దోహదపడతాయి. ప్రోటీన్లు శరీరం సెల్స్ నిర్మాణం, మరమ్మత్తులకు అవసరం. కరోనా మహమ్మారి సమయంలో రోగ నిరోధక శక్తికి ప్రోటీన్లే కీలకంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 బిలియన్ ప్రజలు ప్రోటీన్ల లోపంతో బాధపడుతున్నారని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. ఎదిగే పిల్లలకు, వృద్ధులకు ప్రోటీన్లు చాలా అవసరం. శరీరంలో ప్రోటీన్ల లోపముందని చాలా సందర్భాల్లో తెలుసుకోవడం కూడా కష్టమే. కండరాలు బలహీనం కావడం, మజిల్ పెయిన్స్, జుట్టు బలహీనమై రాలిపోవడం, ఎముకల పటుత్వం తగ్గడం, త్వరగా విరగడం,త్వరగా అలసట రావడం, జాయింట్ పెయిన్స్, చర్మం డ్రైగా మారి నిర్జీవంగా ఉండటం, జుట్టు రాలడం, గోర్ల సమస్యలు వంటివి శరీరంలో ప్రోటీన్ల లోపానికి ప్రధాన లక్షణాలు. ఈ క్రమంలో ప్రోటీన్ల లోపముంటే..చాలా ఇబ్బందులు ఎదురౌతాయి.
ప్రోటీన్ లోపంతో కలిగే నష్టాలు
1. శరీరంలో ప్రోటీన్ల లోపంతో ముఖం, చర్మం, కడుపులో స్వెల్లింగ్ సమస్య రావచ్చు
2. ప్రోటీన్ల లోపంతో కొత్త సెల్స్ నిర్మాణం ఆలస్యమౌతుంది. ఫలితంగా హీలింగ్‌లో ఇబ్బంది రావచ్చు.
3. మజిల్స్‌లో ప్రోటీన్ల లోపముంటే..మజిల్స్ పెయిన్ సమస్యగా మారుతుంది.
4. ప్రోటీన్ల లోపంతో తరచూ శరీరంలో ఏదో ఒక భాగంలో ఇన్‌ఫెక్షన్ సోకుతుంటుంది.
5. శరీరంలో ప్రోటీన్ల లోపం వల్ల చాలా అలసటగా ఉంటుంది. ప్రోటీన్ల వల్ల శరీరానికి ఎనర్జీ లభిస్తుంది.
6. ప్రోటీన్ల లోపంతో కేశాలు రాలిపోవడం, డ్రైగా మారడం, నిర్జీవంగా కన్పించడం వంటి సమస్యలు కన్పిస్తాయి.
7. శరీరంలో ప్రోటీన్లు, కాల్షియం లోపముంటే గోర్లు విరిగిపోతుంటాయి.
8. ప్రోటీన్ల లోపంతో శరీరం ఒక్కసారిగా ఉబ్బినట్టయి..లావుగా అన్పిస్తుంది.
9. ప్రోటీన్ల లోపముంటే ఇమ్యూనిటిపై ప్రభావం పడుతుంది. దీనినల్ల రోగ నిరోధక సామర్ధ్యం తగ్గి తరచూ వ్యాధిగ్రస్థులౌతుంటారు.
10. ప్రోటీన్ల లోపం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది. ప్రోటీన్ల లోపంతో తరచూ శరీరంలో ఏదో ఒక భాగంలో ఇన్‌ఫెక్షన్ సోకుతుంటుంది.
Also read: Weight loss Tips: ఈ రసం రోజూ తాగితే పొట్ట, నడుము చుట్టూ కొవ్వు మాయం, స్లిమ్ అండ్ ఫిట్‌గా మారడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook