Back Pain: వజ్రాసనంతో దిమ్మతిరిగే హెల్త్ బెనిఫిట్స్‌, నడుము నొప్పి సైతం మటు మాయం!

Vajrasana Yoga For Back Pain: కడుపులో గ్యాస్, మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారు తప్పకుండా వజ్రాసనం వేయాల్సి ఉంటుంది. ఈ ఆసనం చేయడం వల్ల సులభంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2023, 02:59 PM IST
 Back Pain: వజ్రాసనంతో దిమ్మతిరిగే హెల్త్ బెనిఫిట్స్‌, నడుము నొప్పి సైతం మటు మాయం!

Vajrasana Yoga For Back Pain: దాదాపు దేశ వ్యాప్తంగా లక్షకుపైగా కడుపులో గ్యాస్, మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం. ఇతర అలవాట్ల కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉపశమనం పొందడానికి తప్పకుండా ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. అవును ప్రతి రోజు వ్యాయామాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు సులభంగా పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వజ్రాసనంలో కూర్చొని భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడమేకాకుండా సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వజ్రాసనం వల్ల జీర్ణవ్యవస్థకు కలిగే ప్రయోజనాలు:
చేడు ఆహారాలు విచ్చలవిడిగా తీసుకోవడం వల్ల గ్యాస్-ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. దీని వల్ల జీర్ణక్రియ బలహీనంగా తయారవుతుంది. దీంతో చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వజ్రాసనం వేయాల్సి ఉంటుంది. ఈ ఆసనం ప్రతి రోజూ వేయడం వల్ల సులభంగా పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి.

వజ్రాసనం అంటే ఏమిటి?
వజ్రాసనం అనేది ఆహారం తిన్న తర్వాత చేసే ఏకైక భంగిమ. అంతేకాకుండా చాలా మంది వజ్రాసనాన్ని ధ్యానం యోగా అని కూడా అంటారు. వజ్రసనం వేయడం చాలా కఠినం ఎందుకంటే అన్ని ఆసనాలకంటే కొంత కఠనంగా ఉండొచ్చు. ఈ అసనాన్ని ప్రతి రోజూ వేయడం వల్ల సులభంగా గ్యాస్‌, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

వజ్రాసనం వల్ల కలిగే ప్రయోజనాలు:
వజ్రాసనం ప్రతి రోజూ వేయడం వల్ల మనస్సును ప్రశాంతంగా మారుతుంది.
ఆహారాన్ని త్వరగా జీర్ణమవుతుంది.
జీర్ణశక్తి బలపడుతుంది.
గ్యాస్-ఎసిడిటీ, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఒత్తిడి, వెన్నునొప్పి సమస్యలు దూరమవుతాయి.

ఇలాంటి వారు ఆసనాలు వేయోద్దు:
వజ్రాసనం అందరు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. మోకాలి నొప్పులు, గాయం లేదా శస్త్రచికిత్స ఉంటే ఈ వ్యాయామాన్ని చేయకపోవడం చాలా మంచిది. వెన్నుపాము సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు కూడా దీనికి దూరంగా ఉండాలి. పేగు పుండుతో బాధపడేవారు కూడా వజ్రాసనం చేయకూడదు.

Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?

Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFaceboo

 

Trending News