Womens Day 2023: మీ కుమార్తె ఉజ్వల భవిష్యత్ కోసం ఈ పథకాలలో పెట్టుబడి పెట్టండి.. సూపర్ బెనిఫిట్స్ ఇవే..!

Best Schemes For Girl Child: మీ ఆడపిల్ల ఉజ్వల భవిష్యత్‌ కోసం ఇప్పటి నుంచే డబ్బు ఆదా చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. ఈ మూడు పథకాలలో పెట్టుబడిపెట్టి.. మంచి రాబడి పొందండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2023, 07:24 PM IST
Womens Day 2023: మీ కుమార్తె ఉజ్వల భవిష్యత్ కోసం ఈ పథకాలలో పెట్టుబడి పెట్టండి.. సూపర్ బెనిఫిట్స్ ఇవే..!

Best Schemes For Girl Child: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా భారీగా జరగనుంది. మహిళల గౌరవం, హక్కుల కోసం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీరు కూడా మీ ఇంట్లో మహిళలకు వుమెన్స్ డే సందర్భంగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే వారి భవిష్యత్‌కు భరోసా కల్పించే ఆర్థిక బహుమతులు ఇవ్వండి. ఆడపిల్ల పుట్టడంతో తల్లిదండ్రులు ఆమె భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. మీరు కూడా ఆడబిడ్డ పుట్టిన తర్వాత స్వల్ప లేదా దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికల కోసం చూస్తున్నట్లయితే.. ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాల గురించి తెలుసుకోండి. వీటిలో పెట్టుబడి పెడితే భారీ వడ్డీ పొందవచ్చు. 

సుకన్య సమృద్ధి యోజన

ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన ఒకటి. ఈ పథకాన్ని ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ పథకం ద్వారా.. మీరు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మీ ఆడపిల్ల కోసం పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా.. మీరు 18 ఏళ్లు, 21 ఏళ్ల వయస్సు వరకు ఆడపిల్లల కోసం భారీ ఫండ్‌ను సృష్టించవచ్చు. ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తంపై 7.6 శాతం వడ్డీ రేటు అందుతోంది. మీరు ఏడాదికి రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఆడపిల్లకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఖాతాలో జమ చేసిన డబ్బును పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత ఆమె ఖాతా నుంచి జమ చేసిన మొత్తం డబ్బును తీసుకోవచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఆడపిల్లల కోసం భారీ ఫండ్‌ను క్రియేట్ చేయవచ్చు. పిల్లలు కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 15 ఏళ్లు. ఇది కూడా ప్రభుత్వ హామీతో కూడిన పథకం. ఇందులో సంవత్సరానికి రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో మరో స్పెషాలిటీ కూడా ఉంది. మూడేళ్ల తర్వాత లోన్ సౌకర్యం పొందవచ్చు. మీ ఆడపిల్ల కోసం ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా.. మెచ్యూరిటీపై వచ్చిన మొత్తంతో మీరు చదువు, పెళ్లి ఖర్చులను తీర్చుకోవచ్చు.

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం. ఈ పథకం ద్వారా మీ ఆడపిల్ల కోసం లేదా ఇంట్లో ఉన్న ఏ స్త్రీ కోసం అయినా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం తక్కువ ఆదాయ వర్గాల మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. మార్చి 2023లో ఈ పథకంలో పెట్టుబడి పెడితే.. 2025 నాటికి మెచ్యూరిటీ మొత్తాన్ని పొందుతారు. ఈ పథకంలో 7.5 శాతం రాబడి లభిస్తుంది. మీరు ఈ పథకంలో ఏడాదికి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

Also Read: Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఓపీఎస్‌పై కీలక ఉత్తర్వులు  

Also Read: Andrey Botikov: కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్త హత్య.. బెల్టుతో గొంతు కోసి దారుణం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News