Shakib Al Hasan No 1 Bangladesh bowler to take 300 wickets in ODI: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్, సీనియర్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 300 వికెట్లు పడగొట్టాడు. దాంతో బంగ్లాదేశ్ తరపున 300 వన్డే వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. చట్టోగ్రామ్ వేదికగా సోమవారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో రెహాన్ అహ్మద్ వికెట్ పడగొట్టడం ద్వారా షకీబ్ ఈ ఘనత అందుకున్నాడు. వన్డే క్రికెట్లో 300 వికెట్స్ పడగొట్టిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా.. ఓవరాల్‌గా 14వ బౌలర్‌గా షకీబ్ రికార్డుల్లోకెక్కాడు.
బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan 300 Wickets)కు ముందు ఇద్దరు మాత్రమే 200 వన్డే వికెట్ల మైలురాయిని అధిగమించారు. వెటరన్ పేసర్ ముష్రఫే మోర్తజా 218 వన్డేల్లో 269 వికెట్లు పడగొట్టగా.. అబ్దుర్ రజాక్ 153 వన్డేల్లో 207 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ 227 వన్డేల్లో 300 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ క్రికెట్లో అత్యధిక వన్డే వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ముత్తయ్య లఖాతాలో 534 వన్డే వికెట్స్ ఉన్నాయి. వసీం అక్రమ్ (502), వకార్ యూనిస్ (416), చమిందా వాస్ (400), షాహిద్ అఫ్రిది (395) టాప్ 5లో ఉన్నారు.
ప్రపంచ క్రికెట్లో అత్యధిక వన్డే వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో టాప్ 5 తర్వాత షాన్ పొలాక్ (393), గ్లెన్ మెక్‌గ్రాత్ (381), బ్రెట్ లీ (380), లసిత్ మలింగ (338), అనిల్ కుంబ్లే (337), సనత్ జయసూర్య (323), జవగల్ శ్రీనాథ్ (315), డేనియల్ వెటోరీ (305), షకీబ్ అల్ హసన్ (300) వరుసగా ఉన్నారు. బంగ్లా నుంచి షకీబ్ అల్ హసన్ దరిదాపుల్లో ఎవరూ లేరు. దాంతో ఈ రికార్డు షకీబ్ పేరుపై చాలా ఏళ్ల పాటు ఉండే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 48.5 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌటైంది. షాంటో (50), ముష్ఫికర్ రహీమ్ (70), షకీబ్ (75) అర్ధ సెంచరీలతో చెలరేగారు. జోప్రా ఆర్చర్ 3 వికెట్స్ పడగొట్టాడు. 247 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 43.1 ఓవర్లలో 196 పరగులకు ఆలౌట్ అయింది. దాంతో 50 పరుగుల తేడాతో బంగ్లా గెలిచింది. షకీబ్ (4/35) చెలరేగాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జేమ్స్ విన్స్ (38) టాప్ స్కోరర్.
Also Read: Hero New Splendor 2023: సరికొత్త 'హీరో స్ల్పెండర్' వచ్చేసింది.. మైలేజ్ 70 కిమీ! ధర కేవలం 83 వేలే
Also Read: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. స్టార్ బౌలర్ దూరం! ఇప్పటికే బుమ్రా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.