IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. స్టార్‌ బౌలర్‌ దూరం! ఇప్పటికే బుమ్రా

Mumbai Indians pacer Jhye Richardson is ruled out of IPL 2023. ఆస్ట్రేలియా పేసర్‌ జే రిచర్డసన్‌ ఐపీఎల్ 2023కి అందుబాటులో ఉండడంపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 22, 2023, 02:07 PM IST
  • ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌
  • స్టార్‌ బౌలర్‌ దూరం
  • ఇప్పటికే బుమ్రా
IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. స్టార్‌ బౌలర్‌ దూరం! ఇప్పటికే బుమ్రా

Mumbai Indians pacer Jhye Richardson is likely to ruled out of IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023కి ముందు ముంబై ఇండియన్స్‌ జట్టుకు వరుసగా షాక్స్ తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వెన్ను గాయం కారణంగా ఐపీఎల్ 2023కి దూరం కాగా.. తాజాగా మరో స్టార్ పేసర్ కూడా మెగా టోర్నీ ఆడడం అనుమానంగానే ఉంది. ఆస్ట్రేలియా పేసర్‌ జే రిచర్డసన్‌ ఐపీఎల్ 2023కి అందుబాటులో ఉండడంపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది. మోచేతి గాయం కారణంగా రాబోయే సీజన్‌కు అతడు దూరమయ్యే అవకాశం ఉంది.

ఆసీస్ బౌలర్ జే రిచర్డ్‌సన్ గత కొన్ని రోజులుగా మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించడానికి దాదాపు 3 నుంచి 4 వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం తెలుస్తోంది. గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్‌కు కూడా రిచర్డ్‌సన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. రిచర్డ్‌సన్ స్థానంలో నాథన్ ఎల్లీస్‌ జట్టులోకి వచ్చాడు. ఇక ఐపీఎల్ 2023 వరకు కూడా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించే అవకాశాలు లేవట. ఇదే జరిగేయితే ముంబై బౌలింగ్‌ విభాగం చాలా బలహీనంగా మారుతుంది. 

జే రిచర్డ్‌సన్ ముందుగా బిగ్ బాష్ లీగ్ 2023 సమయంలో గాయపడ్డాడు. గాయం కారణంగా కారణంగా అతను కొన్ని మ్యాచ్‌లు ఆడలేదు. మార్ష్ కప్ మరియు షెఫీల్డ్ షీల్డ్‌లో కొన్ని మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలోనే మార్చి 17న భారత్, ఆస్ట్రేలియా మధ్య  ప్రారంభమయ్యే మూడు-మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూయమయ్యాడు. ఇక ఐపీఎల్ 2023 వేలంలో రూ. 1.5 కోట్లకు ముంబై ఇండియన్స్ జే రిచర్డ్‌సన్‌ను కొనుగోలు చేసింది. జస్ప్రీత్‌ బుమ్రా సహా రిచర్డ్‌సన్‌ దూరమయితే ముంబైకి కష్టాలు తప్పవు. ఇక ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పైనే ముంబై ఆశలు పెట్టుకుంది.

ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. 2023 ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌, మాజీ ఛాంపియన్  చెన్నై సూపర్ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ మొదలు కానుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత మూడేళ్లుగా సొంత మైదానాల్లో మ్యాచ్‌లు జరగని విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో.. ఈసారి హోమ్‌ గ్రౌండ్‌లో మ్యాచ్‌లను చూసే అవకాశం భారత అభిమానులకు దక్కనుంది. మ్యాచ్‌లను చూసేందుకు ఫాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

Also Read: Hero New Splendor 2023: సరికొత్త 'హీరో స్ల్పెండర్‌' వచ్చేసింది.. మైలేజ్ 70 కిమీ! ధర కేవలం 83 వేలే  

Aslo Read: Satrun Rising 2023: కుంభ రాశిలో శని పెరుగుదల.. ఈ రాశుల వారికి కొత్త ఉద్యోగం, ఊహించని డబ్బు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News