Royal Enfield Classic 350: కేవలం 50 వేలు చెల్లించి 5 వేల ఈఎంఐతో మీ సొంతం చేసుకోండి

Royal Enfield Classic 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే ఆ లుక్కే వేరు. క్లాసీ లుక్. బైక్‌పై వెళ్తుంటే రాజఠీవి ఉట్టిపడేలా ఉంటుంది. ఇందులో క్లాసిక్ 350 కంపెనీ బెస్ట్ సెల్లింగ్ బైక్‌గా ఉంది. ఈ బైక్‌ను ఇప్పుడు మీరు కేవలం 50వేలకే తీసుకెళ్లవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 12, 2023, 03:30 PM IST
Royal Enfield Classic 350: కేవలం 50 వేలు చెల్లించి 5 వేల ఈఎంఐతో మీ సొంతం చేసుకోండి

ఇండియాలో అద్భుతమైన క్లాసీ లుక్ బైక్స్ గురించి చెప్పుకోవాలంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ పేరు ప్రస్తావించుకోవల్సిందే. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 అనేది రెట్రో స్టైల్ మోటార్ సైకిల్. లుక్‌తో పాటు ఫీచర్లు కూడా అద్భుతమే. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో 346 సిసి, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలెండర్ ఇంజన్ ఉన్నాయి. గరిష్యంగా 19.1 బీహెచ్‌పి సామర్ధ్యం, 28 ఎన్ఎం మ్యాగ్జిమమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5 స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ సామర్ధ్యం 13.5 లీటర్లు. ఇక మైలేజ్ విషయానికొస్తే లీటరుకు 37 కిలోమీటర్లు వస్తుంది. ఈ బైక్ ఖరీదు 1.92 లక్షల రూపాయల్నించి ప్రారంభమై..గరిష్టంగా 2.21 లక్షలుంది. ఆన్‌రోడ్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో సింగిల్ ఛానెల్ ఏబీఎస్ వేరియంట్ ధర 1.92 లక్షల రూపాయలు కాగా, టాప్ వేరియంట్ 2.21 లక్షల రూపాయలుంది. అయితే ఇవి ఎక్స్ షోరూం ధరలు మాత్రమే. ఆన్‌రోడ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ బైక్‌ను లోన్ ఆధారంగా కూడా తీసుకోవచ్చు. డౌన్ పేమెంట్, కాల పరిమితి, వడ్డీ రేటును బట్టి ఈఎంఐ మారుతుంది. బ్యాంకుల్ని బట్టి కూడా ఈఎంఐలో మార్పు కన్పిస్తుంది. 

50 వేలకే క్లాసిక్ 350

ఈ బైక్ బేసిక్ వేరియంట్ ఆన్‌రోడ్ 2.10 లక్షలుంటుంది. డౌన్ పేమెంట్, కాల పరిమితిని బట్టి ఈఎంఐ మారుతుంటుంది. కాల పరిమితి 1 నుంచి 7 ఏళ్ల వరకూ ఉంటుంది. ఒకవేళ 50 వేల రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే 10 శాతం వడ్డీ, మూడేళ్ల కాల పరిమితి లెక్కేసుకుంటే నెలకు వాయిదా 5186 రూపాయలవుతుంది. అంటే తీసుకునే రుణానికి 26 వేల అదనంగా చెల్లించాల్సి వస్తుంది.

Also read: Cheapest 7 Seater car: దేశంలో డెడ్ ఛీప్ 7 సీటర్ కారు ఇదే.. ధర కేవలం రూ.10 లక్షలే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News