Skin Care Tips At Home: ఆహారాన్ని రుచికరంగా మార్చడానికి టమోటా ఎంత కీలక పాత్ర పోషిస్తుందో..చర్మ సమస్యలను తొలగించడానికి కూడా అంతే కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ టమోటా రసాన్ని వినియోగిస్తే సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ముఖంపై మెరుపును తీసుకురావడానికి సహాయపడుతుంది. అయితే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగించకుండా టమోటా ఫేస్ మాస్క్ వినియోగించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
టమోటాతో ప్రయోజనాలు:
1. టమోటా ఫేస్ మాస్క్:
టమోటాలో లైకోపీన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ముఖంపై ముడతలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తప్పకుండా టమోటా ఫేస్ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
టమోటా ఫేస్ మాస్క్‌ను ఎలా తయారు చేయాలో తెలుసా?
ఫేస్ మాస్క్ చేయడానికి.. ఒక పండిన టమోటాను ఒక టీస్పూన్ తేనెతో కలపండి. వాటిని మిశ్రమంగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే త్వరలోనే మెరుస్తున్న చర్మం పొందుతారు.
2. టమోటా జ్యూస్ టోనర్:
టమోటా రసం జిడ్డుగల, మొటిమల గల చర్మారికి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రసాన్ని టోనర్‌గా వినియోగిస్తే చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా చర్మంపై నూనెను తొలగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ టోనర్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
టమోటా రసం టోనర్ ఎలా తయారు చేయాలి?
టోనర్ చేయడానికి.. మీరు చేయాల్సిందల్లా టమోటా రసం, రోజ్ వాటర్ కలిపి కలపాలి. ఇలా కలిపిన తర్వాత కాటన్‌తో ముఖానికి అప్లై చేయాలి.
3. టమోటా హెయిర్ మాస్క్:
టమోటాలో విటమిన్ ఎ, సి అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి టమోటా హెయిర్ మాస్క్‌ను జుట్టుకు అప్లై చేస్తే.. జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి, పెరుగుదలకు సహాయపడుతుంది.
టమోటా హెయిర్ మాస్క్ తయారి పద్ధతి:
ఒక చెంచా ఆలివ్ నూనెతో ఒక పండిన టమోటా మిశ్రమం కలపండి. అంతే సులభంగా మీ హెయిర్ మాస్క్ సిద్ధంగా ఉన్నట్లే.. 30 నిమిషాల తర్వాత షాంపూతో మీ జుట్టును శుభ్రం చేసుకోవాలి.
Also Read: Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు
Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook