Low BP Issue: ఆరోగ్యంపై లో బీపీ ప్రభావం ఉంటుందనే విషయం తెలిసినప్పటికీ.. చాలామంది లో బీపీ సమస్యను లైట్ తీసుకుంటుంటారు. హై బీపీ సమస్యను చూసినంత తీవ్రమైన సమస్యగా లో బీపీని చూడరు. కానీ లో బీపీ సమస్యను కూడా తీవ్రంగా పరిగణించకపోతే దాని ప్రభావం ఆరోగ్యంపై కచ్చితంగా ఉంటుందంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. అందుకే ఇంట్లోనే లో బీపీ సమస్యను నయం చేసుకోవడానికి ఉన్న మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లో బీపీ సమస్య అనేది చాలా మందికి ఉంటుందట. కానీ తమలో లో బీపీ సమస్య ఉందని గుర్తించడంలోనే చాలా మంది విఫలం అవడం వల్లే వారికి ఆ సమస్య ఉందనే విషయం కూడా తెలిసే అవకాశం ఉండదు. ఇంకొంతమంది తెలియకుండానే తమకు ఉన్న లో బీపీ సమస్యను బలహీనతగానో లేక మరొక రకమైన ఆరోగ్య సమస్యగానో భావించి కొట్టిపారేస్తుంటారు. కానీ అదే తాము చేస్తోన్న అసలైన పొరపాటు అనే విషయం చాలా మందికి తెలియదు.
లోబీపీ రావడానికి గల కొన్ని కారణాలతో పాటు లో బీపీ సమస్యను నయం చేసేందుకు ఉపయోగపడే హోమ్ రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కారణాలు:
డిహైడ్రేషన్ సమస్య: శరీరానికి తగినంత నీరు అవసరం. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు, రక్త సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతాయి. రక్త నాళాల ద్వారా రక్తాన్ని పంప్ చేసేందుకు గుండె ఎప్పటికంటే ఇంకొంత ఎక్కువే శ్రమించాల్సి ఉంటుంది. దీంతో లో బీపీ సమస్య తలెత్తుతుంది.
గర్భం: ప్రెగ్నెన్సీ సమయంలోనూ లో బీపీ సమస్య రావడం అనేది సర్వసాధారణం.
గుండె సంబంధిత సమస్యలు: గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి శరీరంలో రక్త ప్రసరణ పని తీరుకు అంతరాయం కలుగుతుంది. అందుకే గుండె సరిగ్గా పని చేయకపోయినా.. శరీర అవసరాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయలేకపోయినా.. లో బీపీ సమస్య వస్తుంది.
పోషకాహార లోపం: విటమిన్ B-12, ఐరన్ వంటి కొన్ని పోషకాహార లోపం వల్ల బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. ఇది రక్తహీనతగా మారుతుంది.
ఉప్పు మోతాదు పెంచండి: ఉప్పును అధిక మోతాదులో తీసుకోకూడదు.. అలాగే తక్కువ మోతాదులోనూ తీసుకోకూడదు. ఉప్పు తగినంత మోతాదులో లేకపోతే.. బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. పండ్లు, కూరగాయల నుండి సహజంగా లభించే ఉప్పుతో పాటు మీ రోజువారీ ఆహారంలో కనీసం ఒక టీస్పూన్ ఉప్పు కలపాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సిఫార్సు చేస్తున్నారు.
ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోండి: మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి కనీసం ప్రతీరోజూ 2 నుండి 3 లీటర్ల నీరు తీసుకోవడం ఎంతో అవసరం.
కెఫీన్: లో బీపీ సమస్య నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం కెఫీన్ తాగొచ్చు. ఎందుకంటే కెఫిన్ మీ రక్తపోటును పెంచుతుంది. లో బీపీ నుంచి ఉపశమనం పొందాలంటే కెఫిన్‌తో ఆ రిస్క్ నుంచి బయటపడొచ్చు.
తులసి ఆకులు: తులసి ఆకులలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. యుజినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
ఏదేమైనా లో బీపీ అనేది అంత లైట్ తీసుకునే సమస్య కానే కాదు. వీలైనంత త్వరగా డాక్టర్‌ని సంప్రదించి మీ సమస్యకు తగిన వైద్య సలహా తీసుకోండి.
(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు హోమ్ రెమెడిస్, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఎవరి ఆరోగ్య సమస్య విషయంలో వారికి అనేక వేర్వేరు కారణాలు ఉంటుంటాయి కనుక ఈ సమాచారాన్ని పరిష్కారంగా భావించడానికి ముందుగా తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని ZEE NEWS ధృవీకరించడం లేదనే విషయాన్ని గ్రహించాల్సిందిగా మనవి.)
ఇది కూడా చదవండి : Side Effects Of Soap On Face: ముఖానికి సబ్బు రాసుకునే వాళ్లకు ఇది తెలిస్తే.. మళ్లీ ఆ పనిచేయరు
ఇది కూడా చదవండి : How To Control Diabetes: నువ్వుల నూనె ప్రయోజనాలు! మధుమేహం, కీళ్ల నొప్పులు ఉన్నవారు తింటే కలిగే లాభాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook