Facebook New Feature Video Call: ఫేస్‌బుక్ మెసెంజర్ వినియోగిస్తుంటే ఇది మీకు గుడ్‌న్యూస్. ఇప్పుడు వీడియా కాల్ సందర్భంగా కొత్త ఫీచర్ లభిస్తోంది. ఇకపై యూజర్లు మెసెంజర్ వీడియా కాల్ చేస్తూనే తమకిష్టమైన గేమ్ అడవచ్చని ఫేస్‌బుక్ గేమింగ్ వెల్లడించింది. వీడియో కాల్ ద్వారా స్నేహితులతో గేమ్ ఆడటాన్ని ఈ ప్రక్రియ సులభతరం చేస్తుందని వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో ఒకే సమయంలో మాటలు, గేమింగ్ రెండూ పూర్తవుతాయని తెలుస్తోంది.
ఐవోఎస్, ఆండ్రాయిడ్, వెబ్ మెసెంజర్ వీడియో కాల్‌లో 14 ఉచిత ట్లూ ప్లే గేమ్స్ అందుబాటులో ఉన్నాయని, ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదని ఫేస్‌బుక్ గేమింగ్ తెలిపింది. గేమ్స్‌లో బాంబే ప్లే ద్వారా కార్డు వార్స్, కోట్‌సింక్ ద్వారా ఎక్స్‌ప్లోడింగ్ కిటన్స్ వంటి కొత్తవి ఉన్నాయి. దాంతో పాటు మినీ గోల్ఫ్ ఎఫ్ఆర్వీఆర్, జింగాకు చెందిన వర్డ్స్ విత్ ఫ్రెండ్స్ ఉన్నాయి.
సాధారణంగా గేమ్స్ ఇద్దరి మధ్యే జరుగుతుంటాయి. మెసెంజర్‌లో వీడియో కాల్ ప్రారంభించి సెంటర్‌లోని గ్రూప్ మోడ్ ఐకాన్ పై ప్రెస్ చేసి ప్లే ఐకాన్ ట్యాప్ చేసి గేమ్ అడుకోవచ్చు. ఈలోగా మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కొన్ని విషయాలు వెల్లడించారు. యూఎస్‌లోని యూజర్లకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కోసం ఫీజు చెల్లించే విధానాన్ని మొదలుపెట్టామని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ఈ విధానాన్ని ముందుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో లాంచ్ చేసింది. మెటా వెరిఫైడ్ ప్లాన్ అంటారు దీనిని. మెటా వెరిఫైడ్ ప్లాన్ ధర వెబ్ వెర్షన్ కు నెలకు 11.99 డాలర్లు కాగా, మొబైల్ వెర్షన్ కు 14.99 డాలర్లుగా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
New Feature in Facebook: ఫేస్‌బుక్ కొత్త ఫీచర్.. వీడియో కాల్ చేస్తూనే.. గేమ్స్ సౌకర్యం