Black and White Review: బ్లాక్ అండ్ వైట్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..ఎలా ఉందంటే?

Black and White Review and Rating: యుంగ్ డైరెక్టర్ ఎల్.యెన్.వి సూర్య ప్రకాష్ దర్శకత్వంలో హెబ్బా పటేల్, సూర్య శ్రీనివాస్, లహరి శరీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్లాక్ అండ్ వైట్’ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2023, 08:24 PM IST
Black and White Review: బ్లాక్ అండ్ వైట్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..ఎలా ఉందంటే?

Black and White Movie Review: యుంగ్ డైరెక్టర్ ఎల్.యెన్.వి సూర్య ప్రకాష్ దర్శకత్వంలో హెబ్బా పటేల్, సూర్య శ్రీనివాస్, లహరి శరీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్లాక్ అండ్ వైట్’. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి నిర్మాతలుగా, ఎస్ ఆర్ ఆర్ట్స్ మరియు ఏ యు & ఐ స్టూడియోస్‌ బ్యానర్‌లపై నిర్మించారు. ఏప్రిల్ 14న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథ: వర్ధన్(సూర్య శ్రీనివాస్) & స్వరాంజలి(హెబ్బా పటేల్) ఇద్దరు మూడు సంవత్సరాల పాటు కలిసి ‘సహజీవనం’ చేస్తారు. ఒకరోజు ‘జాను’ అనే అమ్మాయి నుంచి వర్ధన్ కి మెసేజ్ రావడం, అది గమనించిన స్వరాంజలి అడగటంతో ఇద్దరు గొడవపడతారు. ఆ గొడవలో ‘వర్ధన్’ ని చంపేస్తుంది. ఇంతకీ, ఆ జాను ఎవ్వరు? వర్ధన్ ని చంపినా స్వరాంజలి జైలు కి వెళ్లిందా? పప్పువా(నవీన్ నేని) ఎందుకు ‘స్వరాంజలి’ హౌస్ చుట్టూ తిరుగుతుంటాడు? ఇవ్వన్నీ తెలియాలి అంటే, మీరు సినిమా ని ఖచ్చితంగా చుడాలిసిందే?

విశ్లేషణ: ‘వెలుగు చూడాలి అంటే, చీకటి సాయం తీసుకోవాలి’ అనేదే ఈ సినిమా టైటిల్(బ్లాక్ అండ్ వైట్) కథ. ఇలాంటి, పాయింట్ మీద గతంలో సినిమాలు కొకళ్ళలో వచ్చాయి. కాకపోతే, దర్శకుడు ఎల్యెన్వి సూర్య ప్రకాష్ కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారనే చెప్పాలి. సినిమా ఓపెనింగ్ లో స్వరాంజలి(హెబ్బా పటేల్) ని ఎవరో చంపడానికి వస్తున్నట్టు భయంతో స్వరాంజలి పరిగెడుతూ పోలీసుల రక్షణ తీసుకుంటుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. వర్ధన్ & స్వరాంజలి మధ్య కెమిస్ట్రీ చాలా చక్కగా తెర మీద చూపించే ప్రయత్నం చేశారు.

అయితే, ఇంకొంచెం రొమాంటిక్ టచ్ పెంచి ఉంటే బాగుండేదేమో. అలాగే, సినిమా మొత్తం ఒకటే లొకేషన్, రిపీటెడ్ కాస్ట్యూమ్స్ అవ్వడం సగటు ప్రేక్షకుడికి బోరింగ్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది, రెండు సాంగ్స్ సినిమాలో ఉన్నప్పటికీ పెద్దగా ప్లస్ అవ్వలేదనే చెప్పాలి. సినిమాలో అక్కడక్కడ ‘వర్ధన్’ భయపె ట్టించే కొన్ని సీన్స్ రక్తి ఆకట్టుకున్నాయి. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే, క్లైమాక్స్ లో స్టేషన్ దగ్గర వచ్చే ‘ట్విస్ట్ రివీల్ చేసిన విధానం అదిరిపోతుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కొన్ని సందర్భాలలో పగలా, రాత్రా అని సందిగ్ధంలో ఉన్నప్పటికీ సినిమాని తప్పకుండా థియేటర్లలో చూడవచ్చు. దర్శకుడు ఎంచుకున్న కథ, చూపించిన విధానం బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం ఇంకాస్త గ్రిప్పింగ్ ఉంటే బాగుండేది. 

ఇదీ చదవండి: Shaakuntalam Review: సమంత శాకుంతలం రివ్యూ.. విజువల్ ట్రీటే కానీ?

నటీనటులు పెర్ఫామెన్స్: మునుపెన్నడూ చూడని విధంగా ‘హెబ్బా పటేల్’ మల్టీపుల్ షేడ్స్ తో సినిమాలో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుందని చెప్పాలి. బిగ్ బాస్ ఫేమ్ ‘లహరి శారీ’ తనదైన యాక్టింగ్ ముద్ర వేసుకుంది . ‘సూర్య శ్రీనివాస్’ ఫ్లాష్ బ్యాక్ వెర్షన్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తునే ప్రెజెంట్ లో భయపెట్టించిన వేరియేషన్ కూడా ఆకట్టుకుంటుంది. నవీన్ నేని పాత్రను సరిగ్గా స్క్రీన్ మీద ఉపయోగించ లేకపోయినప్పటికీ యాక్టింగ్ లో బాగా రాణించారు.

సాంకేతిక విభాగం: డైరెక్టర్ ’ఎల్యెన్వి సూర్య ప్రకాష్' కథ, కాస్టింగ్ ఎంచుకున్న తీరు బాగుంది. కాకపోతే, కథని చెప్పడంలో కాస్త ఇబ్బంది పడినట్టు కనిపిస్తుందని చెప్పాలి. శివ శర్వాని 'ఎడిటింగ్' విభాగంలో బాగా రాణించారు. సంగీతం అందించిన 'అజయ్ అర్రసాడ' సాంగ్స్ పర్వాలేదు అనిపించినప్పటికీ, అక్కడక్కడ వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కథ స్థాయికి రీచ్ అవ్వలేదు. టి.సురేందర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. 

బాటమ్ లైన్: మల్టీ షేడ్స్ తో అదరకొట్టిన హెబ్బా పటేల్ బ్లాక్ & వైట్

రేటింగ్: 2.5 / 5
ఇదీ చదవండి: Rudrudu Movie Review: ఆ నరుకుడేంది? మాకు బాలయ్య ఉన్నాడుగా లారెన్స్.. ఇదేం అరాచకమయ్యా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News