తెలుగువారి ఇలాఖాలో తృణమూల్ తరఫున చంద్రబాబు ప్రచారం

పశ్చమ బెంగాల్ లో తృణమూల్ తరఫున ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు

Last Updated : May 9, 2019, 05:13 PM IST
తెలుగువారి ఇలాఖాలో తృణమూల్ తరఫున చంద్రబాబు ప్రచారం

ఏపీ సీఎం చంద్రబాబు తృణమూల్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగువాళ్లు గణనీయమైన సంఖ్యలో ఉన్న ఖరగ్ పూర్ లో ఆయన మాట్లాడుతూ బెంగాల్ పురోగతిలో తెలుగువాళ్లు కూడా భాగం కావడాన్ని చూసినప్పుడు ఓ తెలుగువాడిగా ఎంతో గర్విస్తున్నానని తెలిపారు. ఇక్కడ స్థిరనివాసాలు ఏర్పరచుకుని ఈ ప్రాంత అభివృద్ది కోసం తెలుగువాళ్లు పనిచేయడం ఎంతో సంతోషం కలిగిస్తోందంటూ చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా తెలుగు వాళ్లంతా తృణమూల్ కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు. 

ఒకప్పుడు బెంగాల్ ఏంచేస్తే దేశం కూడా అదే చేసేది. ఇవాళ బెంగాల్ లో వచ్చిన పథకం రేపు కేంద్రం ప్రభుత్వం అమలు చేసేది. ఇటీవలి కాలంలో అది పోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి రావాలి అంటూ చంద్రబాబు ప్రసంగించారు. బెంగాల్ ముఖ్యంత్రిగా మమతా బెనర్జీ  ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని కొనియాడారు. బెంగాల్ లోని మొత్తం 42 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే గెలవాలని చంద్రబాబు ఆంకాక్షించారు

Trending News