బ్రిటిష్ ప్రధానమంత్రి థెరిసా మే భారతదేశ సంతతికి చెందిన ఎంపీ రిషి సునాక్ ను తన మంత్రివర్గంలో తీసుకున్నట్లు ప్రకటించారు. కేబినెట్ పునః వ్యవస్థీకరణలో భాగంగా థెరిసా పై విధంగా పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్.నారాయణ మూర్తి అల్లుడు సునాక్.
సునక్(36)ను బ్రిటన్ హౌసింగ్, కమ్యునిటీస్, లోకల్ గవర్నమెంట్ మంత్రిత్వశాఖకు అండర్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ గా నియమించారు. ఈ మేరకు థెరిసా మంగళవారం రాత్రి ట్వీట్ చేశారు. రిషి సునాక్ ఉత్తర యోర్క్ షైర్ లోని రిచ్మండ్ నియోజకవర్గం నుండి 2015లో జరిగిన సాధారణ ఎన్నికలలో గెలిచారు.
ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు. లండన్-ఆధారిత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సహా వ్యవస్థాపకులు. 2014లో రాజకీయాల్లో ప్రవేశించారు. ఈయన స్థాపించిన బిలియన్ పౌండ్ల గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్రిటీష్ చిరువ్యాపారాలకు నిధులు సమకూరుస్తుంది. అక్షతమూర్తి స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్లో క్లాస్మేట్. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు-కృష్ణ, అనౌష్క ఉన్నారు.
Rishi Sunak MP becomes Parliamentary Under Secretary of State at Ministry of Housing, Communities and Local Government @mhclg #Reshuffle pic.twitter.com/C46oGC7O3z
— UK Prime Minister (@Number10gov) January 9, 2018