Allu Arjun: తెలుగు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. 2024 మే 11న నంద్యాలలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర తరుపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో ఈ ఎన్నికల ర్యాలీకి అనుమతులు లేకపోవడంతో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయింది.
Allu Arjun: అల్లు అర్జున 2024 ఏపీలో అసెంబ్లీలో పాటు పార్లమెంట్ కు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తన మావయ్య జనసేనకు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించినా.. నంద్యాలలో మాత్రం తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన శిల్పా రవిచంద్రకు సపోర్ట్ గా నిలిచి ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి శిల్పారవి కానీ, అల్లు అర్జున్ తరపున కాని ఎవరు ముందస్తు అనుమతి తీసుకోలేదు. దీంతో స్థానిక వీఆర్వో ఈ విషయమై సీరియస్ అయ్యారు.
అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ జరిగిందని పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో అల్లు అర్జున్‌తోపాటు శిల్పా రవిపై సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలును ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే అప్పట్లో ఆ కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. రేపు విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అప్పట్లో అల్లు అర్జున్.. తన మావయ్య జనసేనకు సపోర్ట్ చేస్తానంటూనే వైసీపీకి చెందిన తన ఫ్యామిలీ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర రెడ్డి తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై పవన్ అభిమానులు .. అల్లు అర్జున్ తీరుపై ఇప్పటికీ గుర్రుగా ఉన్నారు.
అల్లు అర్జున్ విషయానికొస్తే.. త్వరలో ‘పుష్ప 2’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్యాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలే ఉన్నాయి.