Astrology: కన్యా రాశిలో శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారికీ ఆర్ధిక కష్టాలు.. పరిహారాలు ఇవే..

Astrology: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి విలాస గ్రహం అనే పేరుంది.శుక్రుడి అనుగ్రహం ఉంటే ప్రేమ, అందం, ఆకర్షణ, గ్లామర్ ఫీల్డ్ వంటి వాటికి శుక్రుడే అధిపతి. మరోవైపు ఈయన రాక్షస గురువు కాబట్టి.. ఈయన అనుగ్రహం ఉంటే మంచి జ్ఞానం కలిగిస్తాడని ప్రతీతి. ప్రస్తుతం ఈయన సింహరాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో శుక్రుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. 

1 /5

కన్యారాశిలో శుక్రుడి ప్రవేశం వలన కొన్ని రాశుల వారికీ అనుకూల ఫలితాలు ఉంటే.. ఇంకొన్ని రాశుల వారికీ ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. అయితే శుక్రుడి రాశి మార్పు గ్రహ మండలంలో ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు.

2 /5

మేష రాశి కన్యారాశిలో శుక్రుడి సంచారం వలన మేషరాశి వారికీ కొన్ని కష్టాలు తప్పవు. చేస్తోన్నసంస్థలు ఇతర ఉద్యోగులతో వాదనలు పక్కనపెట్టాలి. ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టుతాయి. అవసరమైన ఒత్తిడి కలుగుతుంది. ఈ రాశుల వారు ప్రతి బుధ, శుక్ర వారాల్లో బుధ,శుక్ర జపాలతో పాటు నవగ్రహాల చుట్టు తిరిగితే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

3 /5

కర్కాటక రాశి.. కన్యా రాశిలో శుక్రుడి సంచారం వలన కర్కాటక రాశి వారికి కష్టాలు చుట్టుముడతాయి. ఆర్ధిక జీవితంలో హెచ్చు థగ్గులు ఉంటాయి. సవాళ్లను ఎదుర్కుంటారు. పనులు చేయడంలో ఆలస్యం జరగుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యం పట్ట ప్రత్యేక శ్రద్ధ అవసరం.

4 /5

మకర రాశి కన్యారాశిలో శుక్రుడి సంచారం వలన ఈ రాశి వలన అనుకున్న పనులు జరగవు. డబ్బు విషయంలో అప్రమత్తత అవసరం. భార్య భర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. కాబట్టి జీవిత భాగస్వామితో వాదులాటలు వద్దు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం.

5 /5

గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Media ధృవీకరించడం లేదు.