Liver Health Foods: లివర్‌ను క్లీన్ అండ్ హెల్తీగా ఉంచే 5 అద్భుత పదార్ధాలు

Liver Health Foods in Telugu: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం లివర్. శరీరంలో పేరుకునే విష పదార్ధాలను సమర్ధవంతంగా బయటకు తొలగిస్తుంది. అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. లివర్ పనితీరులో ఏ మాత్రం తేడా వచ్చినా వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే లివర్ ఆరోగ్యం చాలా అవసరం. 

లివర్ ఆరోగ్యం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. కేవలం సరైన డైట్ తీసుకోవడం ద్వారా లివర్ హెల్తీగా ఉండేట్టు చేయవచ్చు. లివర్ హెల్తీగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

1 /5

పసుపు పసుపులో ఉండే కర్‌క్యూమిన్ ఓ శక్తివంతమైన కెమికల్. ఇది లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. లివర్ స్వెల్లింగ్ తగ్గుతుంది. విష పదార్ధాలు బయటకు పంపించడంలో దోహదమౌతుంది. పసుపు లివర్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

2 /5

వాల్‌నట్స్ వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లివర్ స్వెల్లింగ్ తగ్గిస్తాయి. విష పదార్ధాలను బయటకు పంపిస్తాయి. 

3 /5

బీట్‌రూట్ బీట్‌రూట్‌లో బీటైన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. లివర్ డీటాక్సిఫికేషన్‌కు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

4 /5

ఆకు కూరలు పాలకూర, మెంతి కూర, తోటకూర వంటి ఆకు కూరలు ఆరోగ్యానికి ముఖ్యంగా లివర్ హెల్తీగా ఉంచేందుకు చాలా మంచివి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. విష పదార్ధాలు బయటకు పంపించడంలో దోహదమౌతాయి. 

5 /5

గ్రీన్ టీ గ్రీన్ టీలో కెటోచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది లివర్‌ను హెల్తీగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. లివర్ సెల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. లివర్ రిజ్యువనేట్ సామర్ధ్యాన్ని పెంచుతుంది