Black Turmeric: పసుపు అందరికీ సుపరిచితమైన కిచెన్ ఇంగ్రెడియెంట్. ఆయుర్వేదపరంగా అద్భుతమైన ఔషదమిది. ప్రతి కిచెన్లో వంటలో తప్పకుండా వినియోగించే మూలికా పౌడర్ ఇది. పసుపు లేకుండా వంట పూర్తి కానేకాదు. ఈ పసుపుతో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి.
Black Turmeric: అయితే పసుపు రంగు పసుపు గురించి అందరికీ తెలిసిందే. కానీ నల్ల పసుపు ఎవరైనా ఎప్పుడైనా చూశారా. లేకపోతే ఆ నల్ల పసుపు గురించి మేం మీకు వివరిస్తాం. నల్ల పసుపు ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగింది. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
సాధారణ పసుపు లానే నల్ల పసుపు కూడా చర్మానికి చాలా మంచిది. తేనెతో కలిపి నల్ల పసుపు ముఖానికి రాసుకుంటే అద్భుతమైన నిగారింపు వస్తకుంది. ముఖంపై ఉండే నల్లటి మచ్చలు ముడతలు కూడా తొలగిపోతాయి.
ఇటీవలి కాలంలో తక్కువ వయస్సుకే జాయింట్ పెయిన్స్ సమస్యలు బాధిస్తున్నాయి. ఈ సమస్య మరింత ఎక్కువైతే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ గుణాలు అత్యధికంగా ఉన్న నల్లపసుపుని వినియోగించాలి.
ఎక్కడైనా తెగినప్పుడు లేదా చిన్న చిన్ దెబ్బలు తగిలినప్పుడు ఆ ప్రాంతంలో నల్ల పసుపు పౌడర్ వేస్తే అద్భుతమైన యాంటీ బయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది.
మెరుగైన జీర్ణక్రియ కడుపు సంబంధిత సమస్యలుంటే నల్ల పసుపు ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు నొప్పి, గ్యాస్ సమస్యకు అద్భుతమైన పరిష్కారంగా కన్పిస్తుంది. చేయాల్సిందల్లా నల్ల పసుపు పౌడర్ గ్లాసు నీళ్లలో కలుపుకుని తాగడమే.
నల్ల పసుపు అనేది సాధారణంగా దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. అదే విధంగా చర్మ సంరక్షణకు ఓ ఔషధంలా పనిచేస్తుంది. ఇంకా ఏయే ప్రయోజనాలున్నాయో పరిశీలిద్దాం..