School Holidays: విద్యార్థులకు బంపర్ గుడ్‌న్యూస్‌.. దీపావళికి వరుసగా 4 రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

Diwali School Holidays: విద్యార్థులకు తీపి కబురు అందించింది ప్రభుత్వం. దీపావళి సందర్భంగా వరుసగా 4 రోజులపాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఇది విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. మొన్నటి వరకు దసరా హాలిడేస్‌ దాదాపు 15 రోజులు వచ్చాయి. ఇప్పుడు మరోసారి వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో వారు ఉబ్బితబ్బైపోతున్నారు.
 

1 /6

దీపావళి పండుగ మన దేశంలో అంగరంగ వైభవంగా జరుకుంటారు. మన జీవితపు అజ్ఞాన చీకట్లను తొలగించడానికి ఈ దీపాల పండుగను నిర్వహిస్తారు. ముఖ్యంగా చిన్నా పెద్దా అంతా కలిసి వైభవంగా జరుపుకొంటారు.  

2 /6

అయితే, ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్‌ 31న రానుంది. కొన్ని ప్రాంతాల్లో మరుసటి రోజు నవంబర్‌ 1వ తేదీన కూడా లక్ష్మీ పూజలు నిర్వహిస్తారు. కొన్నిప్రాంతాల్లో ఈ రెండు రోజులు సెలవులు కూడా ప్రటించారు.  

3 /6

దీపావళి పండుగ గురువారం రానుంది. శుక్రవారం కూడా సెలవులు ప్రకటించడంతో ఏకంగా సోమవారం వరకు స్కూళ్లకు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయి. జమ్మూ వంటి రాష్ట్రాల్లో వరుసగా నాలుగు రోజులు స్కూళ్లకు సెలవు మంజూరు చేశారు.  

4 /6

ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణాలో ఇప్పటికే అక్టోబర్ 31న దీపావళి పండుగ సెలవు ప్రకటించారు. బ్యాంకులకు కూడా ఆరోజే సెలవు ఉంది.   

5 /6

స్కూళ్లు కాలేజీలకు సెలవులు పొడగిస్తారా? చూడాలి. అయితే, ఇప్పటికే భారీవర్షాలు వరదల నేపథ్యంలో గత నెల నుంచి భారీగా స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూనే ఉన్నారు.   

6 /6

ఆ తర్వాత దసరా సెలవులు కూడా వచ్చాయి. ఇటీవల ఏపీలో వరదల నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. తీరప్రాంత, వరద ప్రభావితం ప్రాంతాలకు సెలవులు వచ్చాయి.