YS Jagan Tirumala Declaration: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి సంచలన సవాల్ విసిరారు. ఈ సందర్భంగా తిరుమల పర్యటనకు డిక్లరేషన్ ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు.
తీవ్ర దుమారం: ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లడ్డూ వివాదం రాజుకుంది. రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.
తిరుమలపై రాజకీయం: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ వివాదంపైనే రాజకీయం నడిపిస్తున్నారు.
ఈ క్రమంలో తమపై నింద వేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిప్పికొట్టారు.
జగనే రంగంలోకి: ప్రెస్‌మీట్ నిర్వహించి స్పష్టంగా చెప్పినా అధికార పార్టీ చేస్తున్న విష ప్రచారం ఆగకపోవడంతో మాజీ సీఎం జగన్ రంగంలోకి దిగుతున్నారు.
సీఎం చేసిన పాపం: చంద్రబాబు చేసిన మహాపాపానికి ఈనెల 28వ తేదీన పూజలు చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా తిరుమలను సందర్శించాలని నిర్ణయించారు.
పురంధేశ్వరి సవాల్: రంగంలోకి బీజేపీ: అయితే జగన్ నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి స్వాగతించారు. అయితే స్వాగతిస్తూనే సంచలన సవాల్ విసిరారు. టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతనే మాజీ సీఎం జగన్ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని సూచించారు.
డిక్లరేషన్: అన్య మతస్తులు కావడంతో (జీవో ఎంఎస్ నెంబర్ 311, రెవెన్యూ, ఎండోమెంట్స్ రూల్ నెంబర్ 16) ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని జగన్‌కు పురందేశ్వరి సవాల్ విసిరారు.
ఏం జరగనుంది: మరి జగన్ డిక్లరేషన్ ఇచ్చి తిరుమల సందర్శిస్తారా? లేదా ఏం జరుగుతుందనేది శనివారం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.