Dhanalaxmi Yoga: జ్యోతిష్య పరంగా జూలై నెలలోని రెండవ వారం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ వారంలో ఎంతో శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయడమే కాకుండా గుప్త నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. అయితే కొన్ని గ్రహాల సంచారం కారణంగా ఎంతో శక్తివంతమై ధన లక్ష్మి రాజయోగం కూడా ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ యోగం కారణంగా లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.
ఈ వారం మేష రాశివారి భవిష్యత్‌కి సంబంధించిన విషయంలో పురోగతి లభించడమే కాకుండా కొత్త అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటు పోటీ పరీక్షలు రాసేవారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
కన్య రాశివారికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. అంతేకాకుండా వీరి ప్రభావం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో అనేక అవకాశాలు వస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
తుల రాశివారికి ఈ సమయంలో విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి పదోన్నతులు కూడా లభిస్తాయి. అలాగే అదృష్టం కూడా పెరుగుతుంది.
మకర రాశి వారికి ఈ వారం జ్ఞానం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు వీరు ఈ సమయంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
ధనుస్సు రాశి వారికి కూడా ఈ సమచం చాలా అనుకూలంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా భవిష్యత్‌కి సంబంధించిన విషయాల్లో ప్రయోజనాలు లభిస్తాయి. వీరికి కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి.