Diabetes Foods: మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఈ 5 ఆహార పదార్దాలు ఔషధంలా పనిచేస్తాయి

డయాబెటిక్ రోగులు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రతి ఆహార పదార్ధానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఆధారంగా ఏ ఆహారం తినవచ్చు ఏది తినకూడదనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పదార్ధాలు డయాబెటిక్ రోగులు తినకూడదు. 

Diabetes Foods: డయాబెటిక్ రోగులు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రతి ఆహార పదార్ధానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఆధారంగా ఏ ఆహారం తినవచ్చు ఏది తినకూడదనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పదార్ధాలు డయాబెటిక్ రోగులు తినకూడదు. 

1 /5

లో ఫ్యాట్ మిల్క్ అనేది డయాబెటిక్ రోగులకు మరో మంచి ప్రత్యామ్నాయం. ఇందులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కావడం వల్ల డయాబెటిస్ రోగులు ఆనందంగా తీసుకోవచ్చు.

2 /5

క్యారట్ చలికాలంలో ఎక్కువగా వస్తుంది. ఇందులో పొటాషియం,బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది. 

3 /5

రాజ్మా కూడా మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది. రాజ్మా గ్లైసెమిక్స్ ఇండెక్స్ తక్కువ. ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ రోగులకు రాజ్మా మంచి ఆహారం కాగలదు.

4 /5

పప్పులు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. దైనందిన జీవితంలో వీటిని భాగంగా చేసుకుంటో ప్రోటీన్లు, ఫైబర్ కావల్సినంత లభిస్తుంది. దాంతోపాటు కాల్షియం, పొటాషియం, విటమన్ బి 9 పుష్కలంగా లభిస్తుంది. పుప్పుల గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా 25-30 మధ్యలోనే ఉండటం వల్ల డయాబెటిక్ రోగులకు హానికారకం కాదు. 

5 /5

ఓట్స్ బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే చాలా ప్రయోజనకరం. ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు చాలా మంచిది. ఇందులో ఫైబర్, బీటా గ్లూకన్ ఉండటం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా ప్రయోజనకరం.