Dinesh Karthik Life Story: దినేశ్ కార్తీక్‌కు కట్టప్ప కన్నా దారుణమైన వెన్నుపోటు.. ఫ్రెండ్‌ భార్యను ప్రెగ్నెంట్ చేసిన ఆ క్రికెటర్‌ ఎవరో తెలుసా..!

Dinesh Karthik Wife and Mural Vijay: టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఓ స్నేహితుడి చేతిలో దారుణంగా మోసపోయాడు. అతను కూడా ఎవరో కాదు. టీమిండియా మాజీ ఓపెనర్ మురళీ విజయ్. దినేష్ కార్తీక్ ఇంటికి అప్పుడప్పుడు వెళుతూ చివరికి అతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చివరికి ఈ విషయం తెలుసుకున్న దినేష్ కార్తీక్.. భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ స్టోరీ ఎంటో ఓసారి చదివేయండి. 
 

1 /8

దినేష్ కార్తీక్, మురళీ విజయ్ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఇద్దరు కలిసి తమిళనాడు జట్టుకు ఆడారు. దినేష్ కార్తీక్ 21 ఏళ్ల వయసులో తన చిన్ననాటి స్నేహితురాలు నికితను 2007లో వివాహం చేసుకున్నాడు.  

2 /8

నికితా తండ్రి, దినేష్ కార్తీక్ తండ్రి ఇద్దరు మంచి స్నేహితులు.  వీరి వివాహం ముంబైలో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లికి మురళీ విజయ్ కూడా హాజరయ్యాడు.  

3 /8

ఆ తరువాత కూడా దినేష్ కార్తీక్‌తో ఉన్న స్నేహంతో వాళ్ల ఇంటికి తరచుగా వెళ్లేవాడు మురళీ విజయ్. ఈ క్రమంలో దినేష్ కార్తీక్‌ భార్య నికితతో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది.  

4 /8

2012లో తమిళనాడు విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా మురళీ విజయ్‌, తన భార్య వివాహేతర సంబంధం గురించి దినేష్ కార్తీక్‌కు తెలిసింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.  

5 /8

వెంటనే నికితకు విడాకులు ఇచ్చాడు. దినేష్ కార్తీక్ నుంచి విడాకులు తీసుకున్న నికిత.. ఆ తరువాత మురళీ విజయ్‌ను పెళ్లి చేసుకుంది.  

6 /8

దినేష్ కార్తీక్ నుంచి విడిపోయిన నెల రోజులకే నికిత గర్భవతి అని తెలిసింది. ఆ బిడ్డకు తానే తండ్రి అని తెలుసుకుని మురళీ విజయ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.  

7 /8

కానీ ఫ్రెండ్‌కు మాత్రం దారుణమైన వెన్నుపోటు పొడిచాడు. ఆ తరువాత మురళీ విజయ్, దినేష్ కార్తీక్ ఈ ఘటన తర్వాత బద్ద శత్రువులుగా మారిపోయారు.  

8 /8

భార్య, ఫ్రెండ్ చేసిన మోసం నుంచి కోలుకోవడానికి దినేష్ కార్తీక్‌కు మూడేళ్లు పట్టింది. ఆ తరువాత 2015లో భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌తో ప్రేమలో పడ్డాడు.