Pawan Kalyan 1st Wife: పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. జనసేనానిగా 2024 ఎన్నికల్లో ఏపీ, కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు. అయితే పవన్ రాజకీయ ప్రత్యర్థులకు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడానికి ఏ ఇష్యూ లేకపోవడంతో ఆయన మూడు పెళ్లిళ్ల విషయాన్నే ఎక్కువగా ప్రస్తావించేవారు. ముఖ్యంగా ఆయన మొదటి భార్య ఎవరు.. ? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..
అందరికీ ఏపీ డిప్యూటీ సీఎం రెండో భార్య రేణు దేశాయ్ తో పాటు మూడో భార్య అన్నా లెజ్నెవా గురించి అందరికీ తెలుసు. కానీ ఫస్ట్ వైఫ్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు.
పవన్ కళ్యాణ్ ఫస్ట్ వైపు ప్రెజెంట్ ఏం చేస్తున్నారనే అనేది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఓ క్యూరియోసిటీ ఉంది. పవన్ 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు.
ఇక హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత యేడాదే.. 1997లో నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2007లో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణు దేశాయ్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు.
అప్పటికే వీరికి ఒక అబ్బాయి అకిరానందన్ ఉన్నాడు. ఆ తర్వాత రెండో భార్య రేణుకు విడాకులు ఇచ్చిన రష్యన్ యువతి అన్నా లెజ్నెవాను మూడో వివాహాం చేసుకున్నారు పవన్ కళ్యాణ్.
విశాఖ పట్నానికి చెందిన నందినిని పెద్దల సమక్షంలో వివాహాం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏవో మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన పేరు మార్చుకొని 2010లో అమెరికాలో ఓ ఎన్నారై డాక్టర్ కృష్ణారెడ్డిని 2010లో రెండో పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈమె హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.