Dussehra 2021:విజయదశమి ప్రత్యేకత, రావణ దహనం చూసి తీరాల్సిందే

Vijayadashami celebrated in India:  దసరా ఉత్సవాల్లో భాగంగా చాలా చోట్ల పెద్ద రావణుడి బొమ్మ తయారుచేసి రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తారు. అక్కడక్కడా దుర్గామాత మండపాలు ఏర్పాటు చేస్తారు. 

  • Oct 12, 2021, 21:03 PM IST

Dussehra 2021 When is Vijayadashami celebrated in India, check details here: అక్టోబర్‌–నవంబర్‌ రాగానే ప్రతి ఏడాది దసరా  ఉత్సవాలు మొదలవుతాయి. దేశం అంతటా ఈ పండుగను అంగరంగా వైభంగా నిర్వహించుకుంటారు. ఆలయాలను సుందరంగా అలంకరిస్తారు. చాలా చోట్ల పెద్ద రావణుడి బొమ్మ తయారుచేసి రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల వేళ భక్తులు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు ఉంటారు. చాలా చోట్ల రామ్‌లీలా నాటకాలు ప్రదర్శిస్తారు. అక్కడక్కడా దుర్గామాత మండపాలు ఏర్పాటు చేస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దసరా ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకొంటారు.

1 /5

దసరా ఉత్సవాలు దేశమంతటా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాలను సుందరంగా అలంకరిస్తారు. అలాగే చాలా చోట్ల పెద్ద రావణుడి బొమ్మ తయారుచేసి రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తారు.   

2 /5

ఈ ఉత్సవాల వేళ భక్తులు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు ఉంటారు. చాలా చోట్ల రామ్‌లీలా నాటకాలు ప్రదర్శిస్తారు. దసరా పండుగ రోజున రావణుడితో పాటు కుంభకర్ణ, మేఘనాథుల దిష్టిబొమ్మలను కూడా దహనం చేస్తారు. 

3 /5

దుర్గామాత మండపాలు ఏర్పాటు చేస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దసరా ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకొంటారు. రావణుడిని శ్రీరామచంద్రుడు అంతమొందించాడని చెబుతూ దసరా జరుపుకుంటున్నామనేది ఒక కారణమైతే...మహిషాసురుని దుర్గామాత అంతమొందించిందనే కారణంగా కూడా దసరా వేడుక జరుపుకుంటాం. 

4 /5

దసరా రోజున షమీ పూజ,అపరజిత పూజ,సీమ అవలంగ్హన్ పూజలు నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్‌లో దసరా పెద్ద వేడుకగా నిర్వహిస్తారు. దుర్గా పూజ 10వ రోజున బెంగాళీలు బిజోయ దశమిని పాటిస్తారు.ఈ రోజున దుర్గామాత ప్రతిమలను ఊరేగింపుగా తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేస్తారు.

5 /5

విజయదశమి రోజున అహంకారి అయిన రావణుడిన శ్రీరాముడు అంతం చేశారని నమ్ముతారు. ఓ రాక్షసుడి నుంచి భూమిని శ్రీరాముడు  రక్షించాడని విశ్వసిస్తారు. రావణుడి దురాగతాలు ఈ రోజుతో ముగుస్తాయని భావిస్తారు. ఇక ఈ సారి అక్టోబర్ 15న విజయదశమిని నిర్వహించుకోనున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నిర్వహించే రావణ దహనం చూసి తీరాల్సిందే.