Re Release Highest 1st Day Collections Movies: ‘గబ్బర్ సింగ్’ సహా రీ రిలీజ్ లో ఫస్ట్ డే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన తెలుగు చిత్రాలు ఇవే..

Re Release Highest Collections Movies: గత కొంత కాలంగా తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్  నడస్తోంది. ఓల్డ్ బ్లాక్ బస్టర్ చిత్రాలను 4K లో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా  మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా రీ రిలీజైన ‘మురారి’ మూవీ  రీ రిలీజైన చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. తాజాగా మురారి రికార్డును పవన్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజైన గబ్బర్ సింగ్ బ్రేక్ చేసింది. 

1 /7

గబ్బర్ సింగ్.. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజైన ‘గబ్బర్ సింగ్’ సినిమా తెలుగులో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తొలి రోజు రూ. 7.01 కోట్ల  గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ప్రీమియర్స్ కలిపితే.. రూ. 7.53 కోట్ల గ్రాస్ వసూల్లతో తెలుగులో రీ రిలీజ్ లో ఫస్ట్ డే హైయ్యోస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. 

2 /7

మురారి.. మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రీ రిలీజ్ లో ఫస్ట్ డే  రూ.5.41 కోట్ల గ్రాస్ వసూళ్లతో మొదటి స్థానంలో ఉండే. తాజాగా గబ్బర్ సింగ్ రాకతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది.  ఈ మూవీ మొత్తంగా రీ రిలీజ్ లో మొత్తంగా రూ. 8.90 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ ప్లేస్ ఉంది.

3 /7

బిజినెస్ మ్యాన్.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో  తెరకెక్కిన చిత్రం ‘బిజినెస్ మ్యాన్’. ఈ సినిమా రీ రిలీజ్ లో మొదటి రోజు  రూ.5.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

4 /7

ఖుషీ..  ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఖుషీ’. రీ రిలీజ్ లో ఫస్ట్ డే ఈ సినిమా రూ. 4.15 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 4లో నిలిచింది. 

5 /7

సింహాద్రి.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా  తెరకెక్కిన చిత్రం ‘సింహాద్రి’. ఈ సినిమా రీ రిలీజ్ లో ఫస్ట్ డే రూ. 4.01 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 5లో నిలిచింది.  

6 /7

జల్సా.. పవన్ కళ్యాణ్ హీరోుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జల్సా’. ఈ సినిమా ఫస్ట్ డే 3.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో టాప్ 6లో ఉంది.

7 /7

మొత్తంగా తెలుగులో రీ రిలీజ్ లో ట్రెండ్ తగ్గినట్టు కనిపించినా.. మురారితో మళ్లీ రీ రిలీజ్ లకు ఊపు వచ్చింది. తాజాగా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పీక్స్ చేరిందనే చెప్పాలి.