Saffron benefits: ప్రతిరోజు పరగడుపున కుంకుమ పువ్వు నీళ్లను తాగడం అలవాటు చేసుకొవాలి. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కల్గుతాయని నిపుణులు చెబుతుంటారు.
సాధారణంగా కుంకుమపువ్వు ఎంతో కాస్లీగా ఉంటుంది. దీన్ని ప్రెగ్నెంట్ మహిళలకు పాలల్లో వేసుకుని తాగుతుంటారు. దీని వల్ల పుట్టబోయే సంతానం ఎర్రగా, బొద్దుగా పుడుతారని చాలా మంది భావిస్తారు.
కుంకుమ పువ్వు కశ్మీర్ వంటి ఉత్తర భారత్ లో ఎక్కువగా దొరుకుతుంది. అయితే.. కుంకుమ పువ్వు వల్ల మనకు అనేక ఆరోగ్య కర ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని డైలీ రాత్రిపూట నీళ్లతో వేసుకుని ఉదయం పూట పరగడుపున తాగాలి.
కుంకుమ పువ్వు వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల డీప్రెషన్ వంటి సమస్యలు దూరం అయిపోతాయి. మెమోరీని పెంచుతుంది. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది.
జీర్ణక్రియ ప్రభావం ను మెరుగుపరుస్తుంది. చాలా మంది ఛాతీలో, పొట్ట భాగంలో మంటతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు కుంకుమపువ్వు నీళ్లను తాగితే మంచి ఉపశమనం ఉంటుంది.
పీరియడ్స్ వంటి సమస్యలు దూరమైపోతాయి. ప్రతిరోజు దీన్ని నీళ్లలో వేసుకుని తాగడం వల్ల ఇమ్యునిటీ కూడా పెరుగుతుంది.వర్షాకాలంలో కుంకుమపువ్వు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
కుంకుమ పువ్వుతో చేసిన టీ, కాఫీలు మనకు అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తాయి. మహిళలు బ్లీడింగ్ వంటి సమస్యలు కూడా ఇది దూరం చేస్తుంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)