Schools Holiday: మళ్లీ కుండపోత వానలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు వరుసగా ఐదురోజులు సెలవులు..డిటెయిల్స్ ఇవే..

Heavy rains in TG And AP:  తెలుగు రాష్ట్రాలలో వరుణుడి గండం మాత్రం తప్పేలా కన్పించడంలేదు. ఈ క్రమంలో మరల పలు జిల్లాలలో కుండపోతగా వానకురుస్తుంది. దీంతో ఆయా జిల్లాలోని అధికారులు సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది.
 

1 /6

రెండు తెలుగు రాష్ట్రాలలో వానలు జోరుగా కురుస్తున్నాయి. ఎక్కడ చూసిన కూడా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం వర్షాలకు అతలాకుతలంగా మారిపోయాయి.  ప్రజలు వర్షాలకు బైటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. 

2 /6

ఇక తెలంగాణలోని హైదరాబాద్ లో పాటు ఖమ్మం జిల్లా వరద వల్ల ఎక్కువగా నష్టపోయిందని చెప్పుకొవచ్చు. ఖమ్మంలో ఇప్పటికి కూడా పూర్తిగా బురద మయంగా మారిపోయింది. అక్కడి ప్రజలు వర్షాలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా.. తమకు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహాయం అందడంలేదని కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. 

3 /6

మరోవైపు ఏపీలోని విజయవాడలోని సింగ్ నగర్ వర్షాలకు వణికిపోయింది. అపార్ట్ మెంట్ లలో వరదనీరు భారీగా వచ్చిచేరింది. సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి సహాయక చర్యల్ని చేపట్టారు. అంతేకాకుండా.. మంత్రులు, అధికారుల్ని సైతం ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.   

4 /6

ఏ ఒక్కరు కూడా ఆహారం, ఫుడ్ అందకుండా ఇబ్బందులు పడకూడదని స్పష్టమైన, ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇదిలా ఉండగా... వర్షాల నేపథ్యంలో ఏపీతోపాటు, తెలంగాణలోని పలు జిల్లాలలో మరల కలెక్టర్లు స్కూళ్లకు  సెలవుల్ని సైతం ప్రకటించారు.

5 /6

ఖమ్మం లో భారీ వర్షం, వరదల నేపథ్యంలో..  జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్,  ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు.. 06/09/2024 (శుక్రవారము ) వరకు సెలవులు  ప్రకటించారు. ఆయా జిల్లాలలో పాఠశాలలకు తదుపరి పనిదినం 09/09/2024 (సోమవారము ) ఉంటుదని కూడా కలెక్టర్ల ఆదేశాలు జారీ చేశారు. అన్నియాజమాన్య విద్యాసంస్థలు, తల్లిదండ్రులకు ఈ  సెలవులు ఖఛ్చిత్తంగా పాటించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో వరుసగా ఐదురోజులు సెలవులు రానున్నట్లు తెలుస్తోంది.  

6 /6

అదే విధంగా.. తూర్పుగోదావరి జిల్లాలో.. కూడా వరద ప్రభావం కొనసాగుతుంది. అక్కడ కూడా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తునే ఉంది. ఈ నేపథ్యంలో.. ఈరోజున (బుధవారం) జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి.. జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇవాళ సెలవు ప్రకటించారు.