Best Personal Loan Options: మీరు పర్సనల్ లోన్ తీసుకునే ప్లాన్ లో ఉన్నారా. అది కూడా తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకుల కోసం సెర్చ్ చేస్తున్నారా. అయితే ఈ స్టోరీ మీకోసమే. తక్కువ వడ్డీరేట్లలో పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తున్న బ్యాంకుల గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
Best Personal Loan Options: ఆర్థికపరమైన ఇబ్బందులు, అవసరాలు అందరికీ ఉంటాయి. ఈ అవసరాలను తీర్చుకునే క్రమంలోనే ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని వెతుకుతుంటారు. కొందరు గోల్డ్ లోన్ తీసుకుంటే..మరికొందరు స్థలం కాగితాలతో లోన్ తీసుకుంటుంటారు. అయితే ఇవేవి లేకుండా లోన్ తీసుకునే ఆప్షన్ వ్యక్తిగత లోన్. మీరు ఉద్యోగం చేసే వ్యక్తి అయితే..మీ సిబిల్ స్కోర్ బాగుంటే..మీకు బ్యాంకులు వెంటనే పర్సనల్ లోన్స్ ఇస్తుంటాయి. తక్కువ వడ్డీ రేటుకు రుణం ఇచ్చే బ్యాంకులకు ఎక్కువ పత్రాలు అవసరం లేదు. ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో బ్యాంక్ గురించి మీరు సెర్చ్ చేస్తుంటే ఈ స్టోరీ చదవంది.
HDFC బ్యాంక్: HDFC బ్యాంక్ మీ ప్రొఫైల్ ఆధారంగా 10.85శాతం నుండి 24శాతం మధ్య వడ్డీని వసూలు చేస్తుంది. బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, లోన్ కోసం ప్రాసెసింగ్ ఫీజు 6500 + GST చెల్లించాల్సి ఉంటుంది.
ICICI బ్యాంక్: ICICI బ్యాంక్ వద్ద వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు 10.85 శాతం నుండి 16.25 శాతం మధ్య ఉంటాయి. బ్యాంకు లోన్ మొత్తంపై 2శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
కోటక్ బ్యాంక్: మీరు కోటక్ మహీంద్రా బ్యాంక్ నుండి పర్సనల్ లోన్ తీసుకుంటే, వడ్డీ రేటు 10.99% నుండి 16.99% ఉంటుంది. మీరు లోన్ మొత్తంలో 5 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు, GST కూడా చెల్లించాలి.
SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో వడ్డీ రేట్లు 11.45 నుండి 14.60 శాతంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వ బ్యాంకులో జనవరి 31, 2025 వరకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం లేదు.
ఫెడరల్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ 11.49 నుండి 14.49% చొప్పున వ్యక్తిగత రుణాలపై వడ్డీని వసూలు చేస్తుంది.
యాక్సిక్ బ్యాంక్: యాక్సిస్ బ్యాంక్‌లో వడ్డీ రేట్లు 10.49 నుండి 22.50% వరకు ఉంటాయి. బ్యాంకు రుణ మొత్తంలో 2 శాతానికి సమానమైన ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా : బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యక్తిగత రుణానికి వడ్డీ రేటు 10.85% నుండి ప్రారంభమవుతుంది. అయితే, క్రెడిట్ స్కోర్‌ను బట్టి మార్చుకునే అవకాశం కూడా ఉంది.