HMPV Virus Outbreak: భారత్‎లో HMPV టెన్షన్..పెరుగుతున్న కేసులు..పాటించాల్సిన నిబంధనలు ఇవే

HMPV cases in India: కోవిడ్ పీడ పోయింది అనుకుంటే..ఇప్పుడు మరో పిడుగు వచ్చి పడింది. భారత్ లో ఇప్పుడు హెచ్ఎంపీవీ టెన్షన్ పెరుగుతోంది. తాజాగా దేశంలో మూడు కేసులు నమోదు అయ్యాయి. మూడు నెలల బాలికతోపాటు 8నెలల బాలుడితోపాటు మరో కేసు కూడా నమోదు అయ్యింది. ప్రస్తుతం భయపెట్టిస్తున్న చైనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఈ నిబంధనలు తప్పకుండా పాటించండి. 
 

1 /8

HMPV cases in India: చైనాలో హెచ్ఎంపీ వైరస్ చాలా వేగంగా విస్తరిసోతోంది. మరో కోవిడ్ మహమ్మారిలా విజ్రుంభిస్తోంది. ఈనేపథ్యంలో భారత్ లోనూ తాజాగా మూడు కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తం చేస్తూ ప్రకటనలు కూడా రిలీజ్ చేశాయి.   

2 /8

తాజాగా బెంగుళూరులోని 8 నెలల పాపకు హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) ఉన్నట్లు నిర్ధారణ అయింది.చిన్నారి తీవ్ర జ్వరంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. పాపను పరీక్షించిన వైద్యులు పాపకు హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు గుర్తించారు. తాజాగా 3 నెలల చిన్నారితోపాటు మరో వ్యక్తికూడా ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో భారత్ లో ఈ వైరస్ సంఖ్య మూడుకు చేరింది. వైరస్ విజ్రుంభిస్తున్న నేపథ్యంలో మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం  

3 /8

క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) అనేది ఒక వైరస్. ఇది సాధారణంగా జలుబు వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది తరచుగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. కానీ కొన్నిసార్లు ఇది న్యుమోనియా, ఆస్తమా వంటి తక్కువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)ని మరింత అధ్వాన్నంగా చేస్తుంది. HMPV ఇన్ఫెక్షన్లు శీతాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి.  

4 /8

ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు?  HMPV వైరస్ సంక్రమణ ప్రమాదం చిన్నపిల్లలు, 65 ఏళ్లు పైబడిన పెద్దలు, ఇమ్యూనిటీ వ్యవస్థ తక్కువగా ఉన్న వ్యక్తులకు అటాక్ చేస్తుంది. 5ఏళ్లలోపు పిల్లల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.   

5 /8

వైరస్ ప్రారంభ లక్షణాలు:  దగ్గు, జ్వరం, కారడం లేదా మూసుకుపోయిన ముక్కు, గొంతు నొప్పి, గురక,  ఊపిరి ఆడకపోవడం  

6 /8

ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది? HMPV వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్ల వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ వైరస్‌లు దగ్గు, తుమ్ముల ద్వారా వాతావరణంలో వ్యాపిస్తాయి. షేక్ హ్యాండ్స్ ఇవ్వుడం, కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం, ఫోన్, డోర్ హ్యాండిల్, కీబోర్డ్ లేదా బొమ్మలు వంటి ఉపరితలాలు లేదా వస్తువులను తాకడం ద్వారా కూడా ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.   

7 /8

చికిత్స? హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్‌కి చికిత్స చేసే యాంటీవైరల్ మెడిసిన్ ఏదీ లేదు. ఈ వైరస్ సోకిన వ్యక్తులు ఐసోలేషన్ లో ఉండటం వల్ల తగ్గుతుంది. ఒకవేళ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే ఆసుపత్రిలో చేరడం మంచిది.లక్షణాల తీవ్రతను బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు.

8 /8

నివారణ చర్యలు: కోవిడ్-19 లాగా, ఈ వ్యాధి కూడా మొదట శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. మాస్క్ పెట్టుకోవడం,  చేతులను కడుక్కోవడం, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ డైట్లో చేర్చుకోవడం నివారణ చర్యలు అని వైద్యులు చెబుతున్నారు.