Pawan kalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ ఇద్దరు యువకుల దుర్మరణం ఘటన.. పవన్ కళ్యాణ్ భారీ సాయం..

Game changer event tragedy: గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు హజరై తిరిగి వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డు  ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించినట్లు తెలుస్తొంది.
 

1 /5

గ్లోబల్ స్టార్ రాజ్ చరణ్ హీరోగా గేమ్ చెంజర్ ఈవెంట్ ఇటీవల రాజమండ్రిలో జరిగింది. తమ అభిమాన హీరో.. కార్యక్రమంను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు.  ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి గేమ్ ఛేంజర్ మూవీ యూనిట్ పాల్గొన్నారు. దీనిలో ప్రత్యేక అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం హజరయ్యారు. అయితే.. గేమ్ చెంజర్ మూవీ సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు రానుందని తెలుస్తోంది.   

2 /5

అయితే.. కార్యక్రమంలో అయిపోయిన తర్వాత.. అభిమానులు తమ ఇళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో.. అనుకొని ఘటన చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన శ్రీ ఆరవ మణికంఠ, శ్రీ తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్రవాహనంపై ఇళ్లకు వెళ్తున్నారు. 

3 /5

బైక్ మీద వెళ్తున్న ఆ యువకులను.. మరో వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ యువకులు మృతి చెందినట్లు తెలుస్తొంది. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటన తనను ఎంతగానే కలిచివేసిందన్నారు. అదే విధంగా బాధిత కుటుంబాలకు  తన సంతాపం వ్యక్తం చేశారు.  

4 /5

ఈ క్రమంలో.. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తాము. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు స్పష్టం చేశాను. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.   

5 /5

 గత ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదన్నారు. రోడ్లమీద లైట్లు ఏర్పాటు చేయలేదన్నారు. దీని వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.మరోవైపు ఇప్పటికే చనిపోయిన కుటుంబాలకు దిల్ రాజు.. రూ. 10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రామ్ చరణ్ సైతం.. బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల సాయం ప్రకటించినట్లు కూడా తెలుస్తొంది.