IRCTC: రైలు టికెట్లపై 10 శాతం డిస్కౌంట్.. ఎలాగో తెలుసా!

మీరు రైలు ప్రయాణం చేస్తున్నారు. అయితే మీకు ఈ తగ్గింపు ధర లభిస్తుంది. రైల్వేశాఖ మీకు ఈ తగ్గింపు ఇస్తుంది. కరోనా సంక్షోభం కారణంగా ప్రజలు ప్రయాణించడానికి భయపడుతున్నందున రైళ్లలో చాలా సీట్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి.

1 /5

మీరు రైలు ప్రయాణం చేస్తున్నారు. అయితే మీకు ఈ తగ్గింపు ధర లభిస్తుంది. కరోనా సంక్షోభం కారణంగా ప్రజలు ప్రయాణించడానికి భయపడుతున్నందున రైళ్లలో చాలా సీట్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. ఖాళీ సీట్ల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి IRCTC, రైల్వే తన ప్రయాణీకుల టికెట్ ధరలపై డిస్కౌంట్ అందిస్తుంది.  Also Read: Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి ధరల జోరు

2 /5

కరోనా వైరస్(CoronaVirus) వ్యాప్తి లాంటి సమయాలలో ఇది ప్రయాణికులకు కూడా మేలు చేస్తుంది. ప్రయాణికులు తిరిగి రైలు ఎక్కేలా చేయడంలో భాగంగా 10శాతం వరకు టికెట్ ధరలపై తగ్గింపు అందిస్తున్నారని తెలుసా.

3 /5

రైల్వేస్టేషన్ నుండి రైలు బయలుదేరే ముందు చార్ట్ తయారు చేస్తారు. అందులో ఏమైనా బెర్తులు ఖాళీగా ఉంటే.. రైలు బయలుదేరే అరగంట ముందు తీసుకున్న టికెట్లు(IRCTC) బుక్ చేసుకున్న వారికి లేదా స్టేషన్‌లో కౌంటర్ వెళ్లి టికెట్  వారికి 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ సౌకర్యం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ సహా అన్ని ప్రత్యేక రైళ్లలో అందుబాటులో ఉంది. Also Read: Extra Data Offer: ఈ ప్లాన్స్‌తో 5 GB ఎక్స్‌ట్రా డేటా మీ సొంతం

4 /5

రైలు టిక్కెట్లపై డిస్కౌంట్ కింది విధంగా పొందవచ్చు. 1) మొదటి చార్ట్ తయారైన తరువాత తుది టికెట్ యొక్క ప్రాథమిక ఛార్జీలపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది.  2) బుకింగ్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ ఫీజు మరియు సేవా పన్నుపై మినహాయింపులు ఉండవు.  3) టీటీఈ కేటాయించిన సీట్లపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. Also Read: ATM Safety Tips: ఏటీఎం సేఫ్టీ టిప్స్ సూచించిన ఎస్‌బీఐ

5 /5

రైలు టికెట్లపై 10 శాతం తగ్గింపు అనేది జనవరి 1, 2017 నుండి అమల్లో ఉంది. అయితే మొదట్లో ఈ సౌకర్యం కేవలం రాజధాని ఎక్స్‌ప్రెస్ / దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లలో ప్రవేశపెట్టారు. తదనంతరం అన్ని రిజర్వ్ క్లాస్ రైళ్లలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు.  Also Read: EPFO: ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను UMANG Appలో ఈజీగా చెక్ చేసుకోండి