Jr NTR with Tiger Suit: భుజాన టైగర్ బొమ్మతో ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్ సందడి..ఏకంగా యాంకర్ కే షాకిచ్చాడుగా!

Jr NTR with Tiger Suit at Oscars:  ఆస్కార్ అవార్డులో వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ టైగర్ ముఖం ఉన్న సూట్తో మెరిశాడు. ఆయన అలాంటి సూట్ ధరించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు, అయితే అది ఎందుకు ధరించానో కూడా చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
 

  • Mar 13, 2023, 12:28 PM IST
1 /5

ఆస్కార్ అవార్డుల వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ ఒక స్పెషల్ డిజైనర్ సూట్లో మెరిశారు. ఆ డిజైన్ చేయబడిన సూటు భుజాల మీద పులి బొమ్మ కనిపిస్తోంది.   

2 /5

రెడ్ కార్పెట్ మీద నడిచిన అనంతరం జూనియర్ ఎన్టీఆర్ను ఈ పులిబొమ్మ ఏమిటి అని అక్కడ యాంకర్ ప్రశ్నించగా మీరు మా సినిమా గమనిస్తే అందులో నేను ఒక పులితో పోరాడుతాను అందుకే సింబాలిక్ గా ఈ బొమ్మను వేసుకొచ్చానని అన్నాడు.   

3 /5

అదేవిధంగా గౌరవ్ గుప్తా చేత డిజైన్ చేయబడిన ఈ సూట్ లో నేనొక్కడినే కాదు నా దేశం మొత్తాన్ని నడిపిస్తున్నానని భావిస్తున్నాను, మా దేశ జాతీయ జంతువుగా పులిని గౌరవిస్తాం అందుకే దాని బొమ్మను నా భుజం మీద మోస్తున్నానని అన్నాడు.     

4 /5

దీంతో మిమ్మల్ని చూసి కేవలం భారతదేశం మొత్తమే కాదు సౌత్ ఏషియా మొత్తం గర్వపడుతుంది అంటూ అక్కడ యాంకర్ ఎన్టీఆర్ మీద ప్రశంసల వర్షం కురిపించింది.   

5 /5

ఇక తాను ఎప్పుడూ టీవీలో చూసి ఆనందపడడమే తప్ప ఇక్కడికి వస్తానని కలలో కూడా అనుకోలేదని ఎన్టీఆర్ పేర్కొన్నారు.