Game Changer: అక్కడ పెద్దదెబ్బే పడేటట్టు ఉందిగా.. వారి తప్పిదమేనా..?

Game Changer Hindi Market: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత.. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా పైన అంచనాలు ప్రస్తుతం సౌత్ లోనే తక్కువ ఉన్నాయని మెగా అభిమానులు ఫీల్ అవుతున్న సందర్భంలో.. ఈ చిత్రం హిందీ మార్కెటింగ్ మరింత నిరాశకు గురిచేస్తోంది. బాలీవుడ్ లో ఈ చిత్రంపై అస్సలు అంచనాలు లేకపోవడం గమనర్హం. 

1 /5

ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో.. రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకోవడంతో ..రామ్ చరణ్ కు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఆయన నుంచి వచ్చే తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  

2 /5

దీనికి తోడు ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. అలాగే అమెరికాలోని డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. దీనికి తోడు రాజమండ్రిలో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు.  ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా రాబోతున్నారు. ఇకపోతే ఇదంతా బాగున్నప్పటికీ ప్రమోషన్స్ విషయంలో వెనుక పడడం వల్లే బాలీవుడ్ లో ఈ సినిమాపై అంచనాలు పెద్దగా లేవనే వార్తలు వినిపిస్తున్నాయి.  

3 /5

అసలు విషయంలోకెళితే.. రామ్ చరణ్ తన సినిమా గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్లో అతిపెద్ద రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ కార్యక్రమానికి హాజరయ్యారు.  ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది.  ముఖ్యంగా తన తండ్రి చిరంజీవికి  సల్మాన్ ఖాన్ తో ఉన్న సన్నిహితం అలాగే గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాను బిగ్ బాస్ షోలో ప్రమోట్ చేయడం వల్ల సినిమా విజయవంతం అయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రామ్ చరణ్ తన గేమ్ ఛేంజర్ సినిమాను ప్రమోట్ చేయడానికి బిగ్ బాస్ కి వచ్చారు.  త్వరలోనే ఈ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కానుంది.  

4 /5

 అయితే ఇదంతా బాగున్నప్పటికీ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చిత్ర బృందం ఫెయిల్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ ఆడియన్స్ లోనే ఈ సినిమా గురించి పెద్దగా బజ్ క్రియేట్ అవలేదు.. దీనికి తోడు బాలీవుడ్ లో అసలు ఈ సినిమా వస్తున్నట్లు ప్రేక్షకులకు తెలియకపోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం. అందుకే ప్రమోషన్స్ జోరుగా చేపడితే తప్ప సినిమా ప్రజల్లోకి వెళ్లదని చెప్పాలి.  

5 /5

కనీసం ఇప్పటికైనా సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మేకర్స్ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కాస్త హుషారు పడి సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తే హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.